సిద్ధూ నిల‌క‌డ లేని మ‌నిషి.. అమ‌రీంద‌ర్ సింగ్ షాకింగ్ కామెంట్స్‌

పంజాబ్ కాంగ్రెస్ లో రోజుకో హైడ్రామా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే అమ‌రీంద‌ర్ సింగ్ రాజీనామా చేయ‌గా, తాజాగా పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ త‌న ప‌ద‌వి రాజీనామా చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ విష‌యంలో పంజాబ్ మాజీ ముఖ్య‌మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 12:27 PM IST

పంజాబ్ కాంగ్రెస్ లో రోజుకో హైడ్రామా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే అమ‌రీంద‌ర్ సింగ్ రాజీనామా చేయ‌గా, తాజాగా పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ త‌న ప‌ద‌వి రాజీనామా చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ విష‌యంలో పంజాబ్ మాజీ ముఖ్య‌మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.సిద్ధూ ఒక నిలకడ లేని వ్యక్తి అనే విషయాన్ని తాను ఇంతకు ముందే చెప్పానని ఆయన ట్వీట్ చేశారు. దేశ సరిహద్దుల్లో ఉన్న పంజాబ్ లాంటి రాష్ట్రానికి ఆయన సరిపోరని చెప్పారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ ఆర్మీ చీఫ్ బజ్వాకు సిద్ధూ అత్యంత సన్నిహితుడని… మన దేశానికి సిద్ధూ ప్రమాదకారి అని ఇటీవలే అమరీందర్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు.

పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందని.. కెప్టెన్ రాజీనామాతో కాంగ్రెస్ సగం బలహీన పడితే, సిద్ధూ రాజీనామాతో పూర్తిగా చెదిరిపోయింది. సిద్ధూకి కాంగ్రెస్ ఎంతో చేసిందని, అయితే సిద్ధూ పార్టీకి విశ్వనీయంగా ఉండలేకపోయారని కాంగ్రెస్ మద్దతుదారులు అంటుంటే.. అనుకున్నట్లుగానే పని పూర్తి చేశారని త్వరలోనే బీజేపీకి తిరిగి వస్తారని బీజేపీ మద్దతుదారులు ట్రోల్స్ చేస్తుండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మాజీ సీఎం అమరీందర్ సింగ్ బీజేపీ గూటికి చేరుతున్నారని ప్రచారం జరుగుతున్న తరుణంలో.. అనూహ్యంగా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు సిద్ధూ. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో అధికారికంగా ప్రకటించారు. పీసీసీ చీఫ్ పదవి వదిలినా… పార్టీకి తన సేవలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు సిద్ధూ. ఏదైనా విషయంలో ఒక వ్యక్తి రాజీపడితే అతడి వ్యక్తిత్వం కోల్పోయినట్లు భావిస్తామని.. పంజాబ్ భవిష్యత్తు, సంక్షేమం విషయంలో తాను ఎప్పటికీ రాజీపడనని తెలిపారు. అందుకే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వివరించారు.