Allahabad High Court: కోర్టు ఉద్యోగి చేతివాటం.. యూనిఫాంపై క్యూఆర్‌ కోడ్‌

తరచుగా మనమందరం హోటల్ లేదా రెస్టారెంట్‌లో ఆహారం తిన్న తర్వాత వెయిటర్‌కు డబ్బు రూపంలో టిప్ ఇస్తాం.

  • Written By:
  • Publish Date - December 2, 2022 / 10:13 AM IST

తరచుగా మనమందరం హోటల్ లేదా రెస్టారెంట్‌లో ఆహారం తిన్న తర్వాత వెయిటర్‌కు డబ్బు రూపంలో టిప్ ఇస్తాం. కానీ అలహాబాద్ హైకోర్టులో ఓ ఉద్యోగి టిప్పు కోసం ఏకంగా తన యూనిఫాంపై QR కోడ్‌ అమర్చుకున్నాడు. కోర్టు బంట్రోతు టిప్ కోసం తన నడుముపై పేటీఎం బార్‌కోడ్‌ను పెట్టుకుని, ఆపై లాయర్లను టిప్ అడుగుతున్నాడు. కోర్టులో జమేదారుగా పని చేసే ఓ ఉద్యోగి టిప్పు కోసం ఏకంగా తన యూనిఫాంపై పేటీఎం QR కోడ్‌ అమర్చుకున్నాడు. దీంతో అతడిపై సస్పెన్షన్ వేటు పడింది.

యూపీలోని అలహాబాద్‌ హైకోర్టులో ఇది జరిగింది. రాజేంద్ర కుమార్‌ అనే బిళ్ల బంట్రోతు కోర్టుకు వచ్చే లాయర్లను టిప్పు అడిగేవాడు. నగదు లేదని చెప్పేవారి నుంచి ఎలాగైనా డబ్బులు రాబట్టేందుకు QR ఏర్పాటు చేసుకున్నాడు. అదే సమయంలో నడుముపై పేటీఎం క్యూఆర్ కోడ్ ద్వారా బంట్రోతు టిప్ అడిగే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటో వైరల్ కావడంతో ఆ బంట్రోతుపై కఠిన చర్యలు తీసుకున్నారు.

కోర్టు అతడిని సస్పెండ్ చేసింది. ఈ ఫోటో వైరల్ కావడంతో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజేష్ బిందాల్ బంట్రోతును సస్పెండ్ చేశారు. అలాగే అతనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోర్టు ఆవరణలో యూనిఫాంలో పేటీఎం బార్‌కోడ్‌ల ద్వారా న్యాయవాదులను టిప్స్ అడిగేవాడని ఆరోపించారు. కానీ అలా చేయడం తప్పుగా భావించిన కోర్టు అతడిని సస్పెండ్ చేసింది. కోర్టు బంట్రోతు రాజేంద్ర కుమార్ ఉద్యోగి నంబర్ 5098పై కఠిన చర్యలు తీసుకుంటామని సస్పెన్షన్ ఆర్డర్‌లో రాసింది.