Site icon HashtagU Telugu

Noida Twin Towers Demolition : నోయిడా ట్విన్ టవర్ల కూల్చివేతకు సర్వం సిద్ధం

Noida Towers

Noida Towers

నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతకు సర్వం సిద్ధమైంది. మధ్యాహ్నం 2:30 నుంచి 2:45 మధ్యలో ట్విన్ టవర్స్ ను కూల్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ టవర్స్ ను కూల్చేందుకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను అమర్చారు. కూల్చివేత ప్రారంభమైన 12:30 సెకన్లలో టవర్స్ నేలమట్టం కానున్నాయి. కూల్చివేతల సందర్భంగా టవర్స్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలను, ఎమరాల్డ్ కోర్ట్, ఏటీఎస్ విలేజ్ ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. సాయంత్రం 4గంటల తరువాతే తిరిగి అక్కడి ప్రజలు వారి నివాసాలకు చేరుకొనే అవకాశం ఉంది.కూల్చివేతల పరిసర ప్రాంతాల్లోని హౌసింగ్ సొసైటీలో అండర్ గ్రౌండ్ గ్యాస్, విద్యుత్ నిలిపివేశారు. ట్విన్ టవర్స్ వద్ద నో ఫ్లైయింగ్ జోన్ అమలు చేయడంతో పాటు, చుట్టుపక్కల 500 మీటర్ల వరకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. ఈ ట్విన్ టవర్స్ ను ముంబయికి చెందిన ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థ, దక్షిణాఫ్రికాకు చెందిన జెట్ డిమాలిషన్స్ సంస్థ కూల్చివేయనుంది. గతంలో ఎడిఫెస్ ఇంజనీరింగ్ సంస్థ తెలంగాణ సచివాలయం, సెంట్రల్ జైలును, గుజరాత్ రాష్ట్రంలోని పాత మొతెరా స్టేడియంను కూల్చివేతలు చేపట్టింది.

Exit mobile version