Site icon HashtagU Telugu

Orissa Cabinet Reshuffle : జ‌గ‌న్ త‌ర‌హాలో ఒడిస్సా సీఎం మంత్రుల‌తో రాజీనామా

Orissa Assembly

Orissa Assembly

ఏపీ సీఎం జ‌గ‌న్ త‌ర‌హాలో ఒడిస్సా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ మంత్రివ‌ర్గాన్ని సంపూర్ణంగా ప్ర‌క్షాళ‌న చేయ‌డానికి సిద్ధం అయ్యారు. మంత్రులంద‌రి చేత రాజీనామా చేయించారు. కేబినెట్‌ను స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేసే దిశ‌గా న‌వీన్ ప‌ట్నాయ‌క్ సాగుతున్నార‌ని, ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న కేబినెట్‌లోని మంత్రులతో రాజీనామాలు చేయిస్తున్నార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం మంత్రులుగా ఉన్న వారిని తొల‌గించి కొత్త వారితో కేబినెట్‌ను పున‌ర్వ్య‌వ‌స్థీక‌రించుకోవ‌డానికి న‌వీన్ నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది.

అంతేకాకుండా స్పీక‌ర్ సూర్య‌నారాయ‌ణ పాత్రోకు త‌న కేబినెట్‌లో కీల‌క మంత్రిత్వ శాఖ‌ను అప్ప‌గించ‌నున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ శ‌నివారం తీసుకున్న కీల‌క నిర్ణ‌యం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. . త‌న కేబినెట్‌లోని మంత్రులంద‌రినీ రాజీనామాలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంత్రులందరూ త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేస్తున్నారు. జ‌గ‌న్ మార్క్ పాల‌న ఒడిస్సాలోనూ క‌నిపిస్తుంద‌న్న‌మాట‌.

Exit mobile version