Kedarnath : కేథార్ నాథ్ లో ఆదిశంకరాచార్య విగ్రహం.. విశేషాలు!

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న కేదార్‌నాథ్ ఆలయంలో పునర్నిర్మించిన ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.

  • Written By:
  • Updated On - November 5, 2021 / 02:45 PM IST

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న కేదార్‌నాథ్ ఆలయంలో పునర్నిర్మించిన ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. కేదార్‌నాథ్‌లో ₹130 కోట్ల విలువైన రీ-డెవలప్‌మెంట్ ప్రాజెక్టులను ప్రారంభించారు. 2013లో ఉత్తరాఖండ్ వరదల్లో కొట్టుకుపోయిన ఆది గురు శంకరాచార్య 12 అడుగుల విగ్రహాన్ని పునర్నిర్మించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, “ఈరోజు ఇక్కడ ఆదిశంకరాచార్య సమాధి ప్రారంభోత్సవానికి మీరందరూ సాక్షులు. ఆయన భక్తులు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. దేశంలోని అన్ని జ్యోతిర్లింగాలు మనతో అనుసంధానించబడి ఉన్నాయి” అని అన్నారు.

2013లో వరదల వల్ల జరిగిన విధ్వంసాన్ని కూడా ఆయన గుర్తు చేసుకుంటూ, “కేదార్‌నాథ్‌ను తిరిగి అభివృద్ధి చేయవచ్చా అని ప్రజలు ఆలోచించేవారు. కానీ అది మళ్లీ అభివృద్ధి చెందుతుందని, మునుపటి కంటే గంభీరంగా ఉంటుందని నాలోని ఒక స్వరం ఎప్పుడూ చెబుతుంది. నేను ఢిల్లీ నుండి కేదార్‌నాథ్‌లో పునరాభివృద్ధి పనులను క్రమం తప్పకుండా సమీక్షించా. డ్రోన్ ఫుటేజీ ద్వారా ఇక్కడ జరుగుతున్న వివిధ పనుల పురోగతిని సమీక్షించా. ఈ పనులకు మార్గదర్శకత్వం వహించినందుకు ఇక్కడి ‘రావల్’లందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని ప్రధాని మోదీ అన్నారు. గురు శంకరాచార్య పునర్నిర్మించిన విగ్రహం 35 టన్నుల బరువు ఉంది. దీనిని మైసూర్‌కు చెందిన శిల్పులు తయారుచేశారు. ఇది వర్షం, ఎండను, ఎంతటి వాతావరణాన్ని తట్టుకోగలదు. కేదార్‌నాథ్ ఆలయం వెనుక, సమాధి ప్రాంతం మధ్యలో భూమిని తవ్వి నిర్మించారు. అంతకుముందు రోజు కేదార్‌నాథ్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రార్థనలు చేసి హారతి ఇచ్చారు.