Site icon HashtagU Telugu

Cow Urine : దేశాన్ని గోమూత్రంతో శుద్ధి చేస్తాం.. స్వామి చక్రపాణి మహారాజ్ వ్యాఖ్యలు

Cow Urine

Cow Urine

Cow Urine : తాజాగా హిందీ బెల్ట్‌లోని రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన గెలుపుపై డీఎంకే ఎంపీ ఎస్.సెంథిల్‌కుమార్ మంగళవారం లోక్‌సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  హిందీ రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలుగా ఆయన అభివర్ణించారు. ‘‘కేవలం గోమూత్ర రాష్ట్రాలలోనే బీజేపీ గెలుస్తోంది. దక్షిణాదిలో ఆ పార్టీకి చోటులేదు’’ అని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై సభలో విమర్శలు వెల్లువెత్తడంతో ఎంపీ సెంథిల్ క్షమాపణలు చెప్పారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా బుధవారం అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్  ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘ఇంతకుముందు సనాతన ధర్మంపై జూనియర్‌ స్టాలిన్‌ వ్యాఖ్యలు చేసిన తర్వాత మూడు రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకుంది. మీలాంటి వాళ్ల వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులలో మేల్కొలుపు తీసుకొస్తున్నాయి. ఫలితంగా దేశమంతటా కాషాయ పార్టీకి క్రేజ్ పెరుగుతోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ గెలిచి తీరుతుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా హెలికాప్టర్లు, విమానాల ద్వారా గోమూత్రాన్ని చల్లిస్తాం.  మీ లాంటి వాళ్ల చెడ్డ ఆలోచనలు ఆనాడు మారుతాయి. మీ డీఎన్ఏ శుద్ధి అవుతుంది. దేశం మరోసారి విశ్వ గురువు అవుతుంది’’ అని స్వామి చక్రపాణి మహారాజ్  పేర్కొన్నారు.

Also Read: Chandrababu : రేవంత్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజవుతారా..?

‘‘సెంథిల్‌కుమార్‌ డీఎన్‌ఏ మొఘలులదే. వాళ్లలో ఉన్నది రాక్షసుల డీఎన్ఏ. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు. విదేశీ నిధుల ప్రభావం వల్లే ఇలా మాట్లాడుతున్నారు. గోమూత్రం చల్లిన రోజున ఇలాంటి వాళ్లపై నుంచి కలియుగ ప్రభావం తొలగిపోతుంది’’ అని  స్వామి చక్రపాణి మహారాజ్  కామెంట్ చేశారు. ‘‘ఆవు మూత్రం, గోవు అనేవి మాకు గర్వకారణం. గోమాత పూజకు అర్హురాలు. భారతీయులంతా గర్వించే గోమాతను(Cow Urine) చూసి.. సెంథిల్ సిగ్గుపడుతున్నాడు” అని ఆయన చెప్పారు.