Arvind Kejriwal: అలీపూర్‌ అగ్నిప్రమాదం.. సిఎం కేజ్రివాల్ ఎక్స్‌గ్రేషియా ప్రకటన

  Arvind Kejriwal: నూఢిల్లీలోని అలీపూర్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం(alipur fire incident)లో మృతిచెందిన వారి కుటుంబాలకు సీఎం అర్వింద్‌ కేజ్రివాల్(Arvind Kejriwal) రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా(Exgratia)ప్రకటించారు. అదేవిధంగా తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున, స్వల్పంగా గాయపడిన వారికి రూ.20 వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రమాదంలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారి, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని అర్వింద్‌ కేజ్రివాల్‌ తెలిపారు. ప్రమాద సమాచారం అందిన తర్వాత చాలాసేపటికి […]

Published By: HashtagU Telugu Desk
Arvind Kejriwal

Arvind Kejriwal

 

Arvind Kejriwal: నూఢిల్లీలోని అలీపూర్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం(alipur fire incident)లో మృతిచెందిన వారి కుటుంబాలకు సీఎం అర్వింద్‌ కేజ్రివాల్(Arvind Kejriwal) రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా(Exgratia)ప్రకటించారు. అదేవిధంగా తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున, స్వల్పంగా గాయపడిన వారికి రూ.20 వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు ఆయన తెలిపారు.

ప్రమాదంలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారి, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని అర్వింద్‌ కేజ్రివాల్‌ తెలిపారు. ప్రమాద సమాచారం అందిన తర్వాత చాలాసేపటికి అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి వచ్చినట్లు తనకు సమాచారం ఉన్నదని, దీనిపై విచారణకు ఆదేశిస్తున్నానని ఆయన చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

అదేవిధంగా రెసిడెన్షియల్‌ ఏరియాలో ఫ్యాక్టరీ నడుపుతున్నందుకు ఫ్యా్క్టరీ యజమానిపై కూడా తగిన చర్యలు తీసుకుంటామని కేజ్రివాల్‌ తెలిపారు. కాగా, ఢిల్లీలోని అలీపూర్‌లోగల పెయింట్‌ ఫ్యాక్టరీలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రివాల్‌ ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదానికిగల కారణాలపై ఆరా తీశారు. రెసిడెన్షియల్‌ ఏరియాలో పెయింట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతులు ఎలా వచ్చాయనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

read also: Farmers Protest In Poland: ఐరోపా దేశంలో కూడా రోడ్డెక్కిన రైత‌న్న‌లు.. 500 ట్రాక్టర్లతో 1000 మంది నిరసన..!

  Last Updated: 16 Feb 2024, 02:38 PM IST