Site icon HashtagU Telugu

NIC Recruitment 2023: అలర్ట్..నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్‌లో 598 ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తుకు ఈరోజు చివరి తేదీ

ISRO Jobs

Jobs

కేంద్ర ప్రభుత్వ (NIC Recruitment 2023) ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) సుమారు 600 ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తులకు నోఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) కోసం NIC ద్వారా ఈ రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ (నం. NIELIT/NIC/2023/1) ప్రకారం, 331 సైంటిఫిక్ అసిస్టెంట్ / టెక్నికల్ అసిస్టెంట్, 196 సైంటిఫిక్ ఆఫీసర్ / ఇంజనీర్, 71 సైంటిస్ట్‌లతో సహా మొత్తం 598 పోస్టులను భర్తీ చేస్తోది. NIC కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ ఈరోజు అంటే మంగళవారం, 4 ఏప్రిల్ 2023తో ముగియనుంది. ఆసక్తి గల అభ్యర్థులు చివరి క్షణం వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు అభ్యర్థుల కోసం NIC అధికారిక వెబ్‌సైట్ recruitment.nic.inలో రిక్రూట్‌మెంట్ విభాగాన్ని చెక్ చేయండి. దీని తర్వాత, అప్లికేషన్ పోర్టల్, calicut.nielit.inకి ఇక్కడ ఉన్న యాక్టివ్ లింక్ లేదా క్రింద ఇవ్వబడిన డైరెక్ట్ లింక్ ద్వారా వెళ్లండి. అభ్యర్థులు ముందుగా నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత రిజిస్టర్డ్ వివరాలతో లాగిన్ అయిన అభ్యర్థులు సంబంధిత పోస్ట్ కోసం తమ దరఖాస్తును సమర్పించాలి. ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు రూ.800 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, వివిధ రిజర్వేషన్ కేటగిరీలు, మహిళా అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

అయితే, దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా NIC సూచించిన అర్హత ప్రమాణాలను కూడా తెలుసుకోవాలి. నోటిఫికేషన్ ప్రకారం, సంబంధిత సబ్జెక్టులలో MSc లేదా MCA లేదా BE లేదా B.E.Tech డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు సైంటిస్ట్, సైంటిఫిక్ అసిస్టెంట్/ టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ ఆఫీసర్/ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దేశిత సబ్జెక్టుల్లో ఎంఫిల్ ఉన్న అభ్యర్థులు సైంటిస్ట్ పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మరోవైపు, అన్ని పోస్టులకు అభ్యర్థుల వయస్సు దరఖాస్తు చివరి తేదీ అంటే 4 ఏప్రిల్ 2023 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అయితే, భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది, మరిన్ని వివరాల కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను చూడండి.

Exit mobile version