బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. వచ్చే ఏడాదిలో ఆ రోజుల్లో బ్యాంకులు బంద్!

బ్యాంకులతో ప్రతిఒక్కరికీ అవసరం ఉంటుంది. సంపన్నుల నుంచి సామాన్యుల వరకు అందరూ బ్యాంకు లావాదేవీలు జరుపుతూ ఉంటారు. రోజువారీ అవరరాల కోసం, ఇతరులకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం కోసం, డిపాజిట్ చేయడం కోసం బ్యాంకులు చాలా ఉపయోగపడతాయి.

Published By: HashtagU Telugu Desk
C76dd704 1c68 4d61 B556 589a11dbb2da 63a43a95a2fc0

C76dd704 1c68 4d61 B556 589a11dbb2da 63a43a95a2fc0

బ్యాంకులతో ప్రతిఒక్కరికీ అవసరం ఉంటుంది. సంపన్నుల నుంచి సామాన్యుల వరకు అందరూ బ్యాంకు లావాదేవీలు జరుపుతూ ఉంటారు. రోజువారీ అవరరాల కోసం, ఇతరులకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం కోసం, డిపాజిట్ చేయడం కోసం బ్యాంకులు చాలా ఉపయోగపడతాయి. ఆన్ లైన్ వల్ల బ్యాంకులకు వెళ్లకుండా ఫోన్‌లోనే బ్యాంకు లావాదేవీలు జరుపుకునే వెసులుబాటు వచ్చిన తర్వాత బ్యాంకులకు కస్టమర్లు వెళ్లడం చాలా తక్కువైంది.

కానీ కొంచెం చదువుకున్న వారికి ఆన్ లైన్ బ్యాకింగ్, యూపీఏ లావాదేవీల మీద అవగాహన ఉంటుంది. కానీ నిరక్షరాస్యులకు ఆన్ లైన్, మొబైల్ బ్యాంకింగ్ మీద అంతగా అవగాహన ఉండదు. దీంతో వాళ్లు తప్పనిసరిగా బ్యాంక్‌లకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో అలాంటివారు బ్యాంకులు ఎప్పుడు పనిచేస్తాయి.. ఏ రోజుల్లో సెలవు ఉంటుంది అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది.

ముందుగానే తెలుసుకోవడం ద్వారా ఆర్ధిక అవసరాలకు డబ్బులు రెడీగా ఉంచుకోవచ్చు. కొత్త ఏడాది వస్తుండటంతో.. కొత్త క్యాలెండర్ ప్రకారం బ్యాంకులకు చాలా సెలవులు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 20 రోజులకుపైగా బ్యాంకులకు సెలవులు రానున్నాయి. జనవరి 15 సంక్రాంతి, జనవరి 26 రిపబ్లిక్ డే, ఫిబ్రవరి 18 మహాశివరాత్రి, మార్చి 7 హోలీ, మార్చి 22 ఉగాది, మార్చి 30 శ్రీరామనవమి, ఏప్రిల్ 1 ఆర్ధిక వార్షిక సంవత్సరం, ఏప్రిల్ 5 జగ్జీవన్ రాం జయంతి, ఏప్రిల్ 7 గుడ్ ఫ్రైడే బ్యాంకులు మూతపడనున్నాయి,

ఇక ఏప్రిల్ 14 అండేద్కర్ జయంతి, ఏప్రిల్ 22 రంజాన్, మే 1 మేడే, జూన్ 29 బక్రీద్, మొహర్రం, ఆగస్టు 15, సెప్టెంబర్ 07,18,28, అక్టోబర్ 2,24, నవంబర్ 12,27, డిసెంబర్ 25 తేదీల్లో బ్యాంకులు బంద్ కానున్నాయి. ఇక రెండో శనివారం, ఆదివారాల్లో బ్యాంకులకు సెలవు. వీటిని మినహాయిస్తే మిగతా రోజుల్లో బ్యాంకులు యథావిధిగా ఉంటాయి.

  Last Updated: 29 Dec 2022, 06:44 PM IST