ఉపాధి లేని పరిస్థితుల్లో ఉద్యోగుల భవిష్యనిధి (PF) ఖాతాల నుంచి పూర్తిగా డబ్బులు ఉపసంహరించుకునే అవకాశం ఇకపై కఠినతరమైంది. ఇటీవల EPFO (Employees’ Provident Fund Organisation) సెంట్రల్ బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం, PF ఖాతా ఉన్న వారు కేవలం ఎక్కువకాలం నిరుద్యోగులుగా కొనసాగిన సందర్భాల్లోనే పూర్తిగా నగదు ఉపసంహరించుకునేలా అనుమతి ఇవ్వబడింది. ఏడాది కాలంగా ఉపాధి లేకుండా ఉన్నవారు మాత్రమే తమ EPF మొత్తాన్ని తుది పరిష్కారంగా తీసుకునే హక్కు పొందుతారు. అంతేకాదు, మూడు సంవత్సరాలపాటు ఉపాధి లేని వారు తమ PF మొత్తంతో పాటు పెన్షన్ ఫండ్ మొత్తాన్ని కూడా ఉపసంహరించుకోవచ్చని బోర్డు స్పష్టంచేసింది.
Bihar Election 2025 : నేను ఎన్నికల్లో పోటీ చేయట్లేదు -ప్రశాంత్ కిశోర్
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, ఉద్యోగం కోల్పోయిన తర్వాత కేవలం రెండు నెలల గడువు ముగిసిన వెంటనే అనేక మంది ఉద్యోగులు తమ PF ఖాతాల్లోని మొత్తాన్ని పూర్తిగా తీసుకుంటున్నారు. ఈ కారణంగా దీర్ఘకాలిక పొదుపులు తగ్గిపోతున్నాయి. EPFO ఈ ధోరణిని సమీక్షించిన అనంతరం, ఉద్యోగులు భవిష్యత్తులో ఆర్థిక భద్రత కోల్పోకుండా ఉండేందుకు కొత్త మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా ఉద్యోగులు నిరుద్యోగ కాలంలో తాత్కాలిక అవసరాల కోసం మాత్రమే కొంత మొత్తం ఉపసంహరించుకునే అవకాశం ఉండగా, మొత్తాన్ని ఖాళీ చేయాలంటే కనీసం ఏడాది పాటు ఉపాధి లేకుండా ఉండాలి.
EPFO అధికారులు చెబుతున్నదేమిటంటే, ఈ నిర్ణయం ఉద్యోగుల భవిష్యత్ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్నదని. చాలా మంది ఉద్యోగులు ఉద్యోగం కోల్పోయిన వెంటనే PF ఖాతా మొత్తాన్ని ఖాళీ చేసి తరువాత ఉద్యోగం దొరికిన తర్వాత మళ్లీ కొత్త ఖాతాలు తెరుస్తున్నారు. దీని వల్ల నిరంతర సేవా రికార్డు భంగం కలుగుతోంది. కొత్త నిబంధనలతో అలాంటి పరిస్థితులు తగ్గుతాయని, ఉద్యోగులు దీర్ఘకాలిక పొదుపులను కొనసాగించగలరని EPFO విశ్వసిస్తోంది. ఇదే సమయంలో, ఈ మార్పులు రాబోయే నెలల్లో అధికారిక గెజిట్ నోటిఫికేషన్ రూపంలో అమలులోకి వచ్చే అవకాశం ఉంది.