సమాజ్‌వాదీ పార్టీ (SP) ఎమ్మెల్యే పూజా పాల్(Pooja)ను పార్టీ నుంచి బహిష్కరించడం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. తన భర్త హత్య కేసులో న్యాయం చేసినందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Chief Minister Yogi Adityanath)కు కృతజ్ఞతలు చెప్పి, నేరస్థులపై జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రశంసించిన కొన్ని గంటల తర్వాతే ఆమెపై ఈ చర్య తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణతో పూజా పాల్‌ను బహిష్కరించినట్లు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ప్రకటించారు. ఆమె ఇకపై పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు.
Independence Day 2025: 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైన ఎర్రకోట!
పూజా పాల్ భర్త, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) మాజీ ఎమ్మెల్యే రాజు పాల్, 2005లో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ చేతిలో హత్యకు గురయ్యారు. ఈ కేసులో న్యాయం జరగడంపై ఆమె అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసించారు. “నా భర్త హంతకుడైన అతిక్ అహ్మద్‌ను ముఖ్యమంత్రి మట్టిలో కలిపేలా చేశారు” అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల తర్వాతే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. ఇది ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ దుమారాన్ని సృష్టించింది. బీజేపీ ఈ అంశాన్ని ఉపయోగించుకొని, ఎస్పీని ‘దళిత వ్యతిరేకి’గా అభివర్ణించింది.
బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. “సమాజ్‌వాదీ పార్టీ దళిత వ్యతిరేక వైఖరిని చూపించింది. పూజా పాల్ నేరాలను అణచివేయడంపై ప్రభుత్వాన్ని ప్రశంసించడంతో ఆమెను పార్టీ నుంచి తొలగించారు. ఎందుకంటే ఎస్పీ అతిక్ అహ్మద్‌ను వారి ఓటు బ్యాంకుగా భావిస్తుంది” అని విమర్శించారు. ఎస్పీ బహిష్కరణపై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కూడా మండిపడుతోంది. రాజకీయాల కోసం నేరగాళ్లను ప్రోత్సహించడం సరికాదని, ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలుకుతున్నారు. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది.