Site icon HashtagU Telugu

Akhilesh Yadav: సీబీఐ విచారణకు సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ డుమ్మా!

Akhilesh Yadav Likely To Sk

Akhilesh Yadav Likely To Sk

 

Akhilesh Yadav : ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav)అక్రమ మైనింగ్‌ కేసు(Illegal mining case)లో సీబీఐ(CBI) విచారణకు డుమ్మా కొట్టనున్నారు. అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ఐదేళ్ల క్రితం నమోదైన కేసులో సాక్షమిచ్చేందుకు నేడు ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలంటూ యూపీ మాజీ ముఖ్యమంత్రికి సీబీఐ (CBI) నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. నేడు తమ ముందు హాజరు కావాలంటూ ఆదేశించింది. అయితే అఖిలేశ్‌ విచారణకు హాజరుకావడం లేదని సమాజ్‌వాదీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

2012-13లో అఖిలేశ్‌ యాదవ్‌ గనుల శాఖ మంత్రిగా స్వల్పకాలం పనిచేసినప్పుడు ఈ-టెండర్‌ విధానాన్ని అతిక్రమించి నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్‌ లీజులు మంజూరు చేశారని ఆరోపణ. ఒక పక్క గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నిషేధం ఉన్నప్పటికీ 2012-16 మధ్య కాలంలో పలు గనుల లైసెన్స్‌లను అక్రమంగా రెన్యువల్‌ చేశారని అఖిలేశ్‌ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ సాగిస్తున్నది. త్వరలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే తనను వేధించడానికి బీజేపీ ఈ నోటీసులు జారీ చేయించిందని అఖిలేశ్‌ ఆరోపించారు.

కాగా, అక్రమ మైనింగ్ కేసులో ఈరోజు విచారణకు హాజరు కావాలంటూ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ కు సీబీఐ సమన్లు జారీ చేసింది. అయితే ఆయనను సాక్షిగా మాత్రమే సీబీఐ విచారణకు పిలిచింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సీబీఐ ఈ నోటీసులను జారీ చేసిందని, అఖిలేశ్ యాదవ్‌ను గురువారం ఢిల్లీలో ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమైందని నివేదికలు పేర్కొన్నాయి. 2012-2016 మధ్య హమీర్‌పూర్‌లో జరిగిన అక్రమ మైనింగ్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి ఈ నోటీసులు జారీ అయ్యాయి.