దేశరాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Election 2025) నేపథ్యంలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Uttar Pradesh CM Yogi Adityanath) బీజేపీ తరఫున ఢిల్లీలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ, ఢిల్లీని డంపింగ్ యార్డుగా మార్చారని ఆరోపించారు. ఢిల్లీలోని యమునా నది మురుగు కాలువగా మారిందని, దీనికి ఆప్ పాలననే కారణమని అన్నారు. తాను మహా కుంభమేళా సమయంలో ప్రయాగ్ రాజ్‌లో పుణ్యస్నానం చేశానని, కానీ ఆప్ అధినేత కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఢిల్లీలోని యమునా నదిలో స్నానం చేయగలరా అంటూ సవాల్ విసిరారు.
AP Government : ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల
ఈ వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు స్పందించకపోయినా, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) కౌంటర్ ఇచ్చారు. యోగి పేరును ప్రస్తావించకుండానే, యమునా నది నీరు తాగేందుకు మీరు సిద్ధమా అని సవాల్ చేశారు. యూపీ లోని పరిస్థితుల గురించి ముందుగా ఆలోచించి మాట్లాడాలని ఆయన హితవు పలికారు. అఖిలేష్ యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై ప్రజల్లోనూ వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నాయకుల వ్యక్తిగత విమర్శలతో ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కుతోంది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులపై ఆరోపణలు, విమర్శలతో బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.