Site icon HashtagU Telugu

Akhand Bharat: అఖండ భార‌త్ పై `భ‌గ‌వ‌త్` సంచ‌ల‌న జోస్యం

Bhagawat

Bhagawat

మ‌రో 20 నుంచి 25 ఏళ్ల‌లో అఖండ భార‌త్ ఏర్ప‌డుతుంద‌ని రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ చీఫ్ భ‌గ‌వ‌త్ జోస్యం చెప్పారు. ఇప్పుడు వెళుతోన్న స్పీడ్ తో వెళితే త్వ‌ర‌లోనే అఖండ‌ భారత్ సాకారం కాబోతుంద‌ని ఉద్ఘాటించారు. జ్యోతిష్య శాస్త్ర ప్రవచనాలు ‘అఖండ భారత్’ కలను సాకారం చేసేలా గ్ర‌హాలు అనుకూలంగా ఉన్నాయ‌ని చెబుతున్న విష‌యాన్ని గుర్తు చేశారు. గ్ర‌హ‌శాస్త్ర‌వేత్త పూరీ అంచనాతో ఏకీభవిస్తున్నట్లు భగవత్ ప్ర‌క‌టించారు. అంతేకాదు, అర‌బిందో వంటి తత్వవేత్తలు “భారతదేశం ఎలా పురోగమిస్తుందిష అనే దానిపై విశ్లేషించార‌ని భగవత్ గుర్తు చేశారు. “వాసుదేవ (శ్రీకృష్ణుడు) కోరిక. “నాకు ఎప్పుడూ దీనిపై పూర్తి విశ్వాసం ఉంది. అరబిందో భారతదేశం గురించి చెప్పారు. ఇది నేను ఆధారంగా భావిస్తున్నాను. లెక్కలు మరియు జ్యోతిష్యం ఆధారంగా కాదు“ అంటూ స్వామి రవీంద్ర పూరి చెప్పారు.

ఇప్పుడు వాటినే భ‌గ‌వ‌త్ చెబుతున్నారు. “భారతదేశం గురించి, నేను పూర్తి విశ్వాసంతో చెప్పగలను, అతను చెప్పినట్లు ఖచ్చితంగా జరుగుతుంది, ”అని భ‌గ‌వ‌త్ భావిస్తున్నారు. లక్ష్యం వైపు ప్ర‌స్తుతం పయనిస్తున్న వేగం సాధించడానికి 25-30 సంవత్సరాలు పట్టవచ్చు. ఆ ప్ర‌య‌త్నాన్ని మ‌రింత వేగవంతం చేస్తే, సమయం సగానికి తగ్గవచ్చు, ”అని ఆయ‌న జోస్యం చెప్పారు. “పూరి మాట్లాడే గీతలోని మాటలను మనం గుర్తుంచుకోవాలి. మంచి రక్షణ గురించి. దుర్మార్గులు ఉన్నార‌నే విషయాన్ని కూడా మనం మరచిపోకూడదు. ప్రపంచం నలుమూలల నుండి అన్ని రకాల ప్రజలను భారతదేశం స్వాగతించింది. మంచిని సమీకరించాలి, చెడును సరిదిద్దాలి` అంటూ చెప్పిన అంశాన్ని లేవ‌నెత్తారు. “భారత్ తన లక్ష్యాన్ని సాధించకుండా ఎవరూ ఆపలేర‌ని ఆర్ఎస్ఎస్ చీఫ్ భ‌గ‌వ‌త్ అన్నారు. “ఇస్కోరోకనే వాలే హ్యాట్ జాయేంగే యా మిత్ జాయేంగే అంటూ అఖండ భార‌త్ గురించి ప్ర‌స్తావించారు.

Exit mobile version