Site icon HashtagU Telugu

1 Akash – 4 Targets : ‘ఆకాశ్’ అదుర్స్.. ఒక్క ఫైర్‌తో నేలకూలిన నాలుగు డ్రోన్లు

1 Akash 4 Targets

1 Akash 4 Targets

1 Akash – 4 Targets : స్వదేశీ క్షిపణి రక్షణ వ్యవస్థ ‘ఆకాశ్’ను మరింత డెవలప్ చేసే దిశగా భారత్ మరో ముందడుగు వేసింది. ఆకాశ్ క్షిపణి రక్షణ వ్యవస్థతో ఈనెల 12న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్‌లోని సూర్యలంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో నిర్వహించిన కీలకమైన ప్రయోగం సక్సెస్ అయింది. ఈ ప్రయోగం విశిష్టత ఏమిటంటే.. ఆకాశ్ క్షిపణి రక్షణ వ్యవస్థ ద్వారా జరిపిన  ఒకే ఒక ఫైరింగ్‌తో 30 కిలోమీటర్ల పరిధిలోని నాలుగు డ్రోన్లు నేలకూలాయి. ఏకకాలంలో తన రేంజ్‌లోకి వచ్చే నాలుగు శత్రు లక్ష్యాలను ఆకాశ్ నాశనం చేయగలదని ఈ ప్రయోగంతో నిరూపితమైంది.  ఒకే సమయంలో నాలుగు వేర్వేరు వైపుల నుంచి దూసుకొచ్చే శత్రు లక్ష్యాలను ఆకాశ్ క్షిపణి రక్షణ వ్యవస్థ తునాతునకలు చేయగలదని వెల్లడైంది.

We’re now on WhatsApp. Click to Join.

ఆకాష్ ఫైరింగ్ యూనిట్‌లో ఫైరింగ్ లెవల్ రాడార్ (FLR), ఫైరింగ్ కంట్రోల్ సెంటర్ (FCC), రెండు ఆకాష్ ఎయిర్ ఫోర్స్ లాంచర్ (AAFL)‌లతో పాటు ఐదు సాయుధ క్షిపణులు ఉంటాయి. ఆకాశ్ క్షిపణి  రక్షణ వ్యవస్థలోని రెండు లాంచర్ల నుంచి ఏకకాలంలో చెరో రెండు క్షిపణులను లక్ష్యం దిశగా సంధించారు. అవి వెళ్లి తమ రేంజ్‌లోని డ్రోన్లను తుద ముట్టించాయి. దాదాపు పదేళ్ల ప్రయోగాల తర్వాత ఆకాశ్ క్షిపణి రక్షణ వ్యవస్థను(1 Akash – 4 Targets) సక్సెస్ ఫుల్‌గా మార్చే దిశగా భారత్ పురోగమిస్తోంది.

Also Read: Hibiscus Tea: చలికాలంలో మందారం టీ తాగడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే?