Site icon HashtagU Telugu

Akal Takht : మాజీ డిప్యూటీ సీఎంకు ‘అకల్ తఖ్త్’ సంచలన శిక్ష.. ఏమిటో తెలుసా ?

Akali Dal Chief Sukhbir Badal Akal Takht

Akal Takht : ఆయనొక  మాజీ డిప్యూటీ సీఎం.. పేరు సుఖ్బీర్ సింగ్ బాదల్‌.. ఈయనకు సిక్కు మతపెద్దల అత్యున్నత సంస్థ ‘అకల్ తఖ్త్’ సంచలన శిక్ష విధించింది.  జతేదార్ గియానీ రఘ్బీర్ సింగ్ సహా మొత్తం ఐదుగురు మతపెద్దలతో కూడిన ఈ సిక్కు మత విభాగం సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. సిక్కుల సంప్రదాయ వస్త్రధారణలో ఐదు గురుద్వారాల ఎదుట రెండు రోజులు చొప్పున గార్డ్ డ్యూటీ చేయాలని సుఖ్బీర్‌కు ‘అకల్ తఖ్త్’ హుకుం జారీ చేసింది. గార్డ్ డ్యూటీ చేయాల్సిన గురుద్వారాల జాబితాను కూడా సుఖ్బీర్‌కు అందజేసింది. ఆ గురుద్వారాల ఎదుట ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు కూర్చొని భక్తుల చెప్పులను శుభ్రం చేయాలని అకల్ తఖ్త్ నిర్దేశించింది. అక్కడ గంట డ్యూటీ చేశాక..  గురుద్వారాలోని లంగర్ హాల్‌లోకి వెళ్లి పాత్రలు, గిన్నెలను గంట పాటు కడగాలని సూచించింది. చేసిన తప్పును ఒప్పుకుంటున్నా అంటూ రాసిన పలకను మెడకు ధరించాలని సుఖ్బీర్‌కు తెలిపింది.

Also Read :Rajamouli Speech @ Pushpa 2 Pre Release : పుష్పరాజ్ ఇంట్రడక్షన్ సీన్ అద్భుతం – రాజమౌళి

2007 సంవత్సరం నుంచి 2017 మధ్యకాలంలో పంజాబ్‌ను శిరోమణి అకాలీ దళ్ పార్టీ(Akal Takht) పాలించింది. ఆ ప్రభుత్వం అప్పట్లో తీసుకున్న పలు నిర్ణయాల వల్ల ఆనాడు సిక్కుల మనోభావాలు దెబ్బతిన్నాయి. వాటిపై విచారణ నిర్వహించిన అకల్ తఖ్త్ ఈ ఏడాది ఆగస్టులోనే పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్‌‌ను, ఆయన తండ్రి, దివంగత మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్‌, శిరోమణి అకాలీ దళ్ మాజీ నేత సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సాలను దోషులుగా తేల్చింది. తాజాగా ఇప్పుడు వారికి శిక్షలను అనౌన్స్ చేసింది.  ప్రకాశ్ సింగ్ బాదల్‌కు గతంలో ఇచ్చిన ‘ఫఖ్రే ఖౌమ్’ బిరుదును ఉపసంహరించుకుంటున్నట్లు అకల్ తఖ్త్ పేర్కొంది.

Also Read :Pushpa 2 Ticket Price Hike : పవన్ కళ్యాణ్ కు థాంక్స్ తెలిపిన అల్లు అర్జున్