Site icon HashtagU Telugu

Lockup Death : తమిళనాడు లాకప్ డెత్.. పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు

Lockup Death

Lockup Death

Lockup Death :తమిళనాడులోని శివగంగై జిల్లాలో సంచలనం రేపిన సెక్యూరిటీ గార్డు అజిత్ కుమార్ కస్టడీ మృతికి సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోస్టుమార్టం నివేదికలో అజిత్ శరీరంపై 44 లోతైన గాయాలు ఉన్నట్టు వెల్లడైంది. ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో తమిళనాడు ప్రభుత్వం కేసును సీబీఐకి బదిలీ చేసింది.

వైద్య నిపుణుల ప్రకారం, అజిత్‌కు రోజులు తరబడి కర్రలు, లాఠీలు, ఇతర కఠిన వస్తువులతో తీవ్రంగా దాడి చేసినట్టు గుర్తించారు. ఈ దాడిలో గుండె, కాలేయం వంటి ముఖ్య అవయవాల్లో తీవ్రమైన రక్తస్రావం చోటుచేసుకుని అదే అతని మృతికి కారణమైందని స్పష్టం చేశారు. ఈ గాయాల తీవ్రతే అతనిపై జరిగిన అమానవీయ హింసకు స్పష్టమైన సూచనగా ఉంది.

తిరుప్పువనం సమీపంలోని మడపురం భద్రకాళి ఆలయంలో జరిగిన చోరీ ఘటనలో అనుమానితుడిగా అజిత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ పేరుతో అమానుషంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం స్పందించి విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగించింది.

Air India : ఎయిర్ ఇండియా వివరణ.. నష్టపరిహార ఫారాలపై బలవంతం చేయలేదు