Maharashtra : లోక్‌సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర రాజకీయాల్లో వరుస పరిణామాలు

  • Written By:
  • Publish Date - February 17, 2024 / 11:38 AM IST

 

Ajit Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌దే అసలైన ఎన్సీపీ అంటూ స్పీకర్ ప్రకటించిన తర్వాతి నుంచి రాజకీయాలు రోజురోజుకు మరింత వేడెక్కుతున్నాయి. తాజాగా ఇప్పుడు అజిత్ చేసిన ప్రకటన పవార్ కుటుంబంలోని కలహాలను బయటపెట్టింది. సీనియర్ నేత ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్(NCP chief Sharad Pawa)కుమార్తె సుప్రియా సూలే(Supriya Sule)పై అజిత్ పవార్ తన భార్య సునేత్రా పవార్‌(Sunetra Pawar)ను బరిలోకి దింపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. బారామతి లోక్‌సభ స్థానంలో ఐదు దశాబ్దాలుగా పవర్ కుటుంబం జెండా ఎగురవేస్తోంది. 2009 నుంచి సుప్రియ వరుసగా మూడుసార్లు గెలుపొందారు.

1967, 1972, 1978, 1980, 1985, 1990 అసెంబ్లీ ఎన్నికల్లో శరద్ పవార్ బారామతి నుంచే గెలుపొందారు. ఇదే నియోజకవర్గం నుంచి 1984, 1996,1998, 1999, 2004లలో లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే, ఈసారి మాత్రం పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఎన్సీపీ రెండు ముక్కలు కావడం, ఎన్సీపీ సభ్యులు కొందరు ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని బీజేపీ(bjp) ప్రభుత్వంలో చేరడంతో రాజకీయ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బారామతి నుంచి సుప్రియా సూలేపై తమ అభ్యర్థే గెలుస్తారని, తాను అదే స్థానం నుంచి ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తానని అజిత్ పవార్ చెప్పారు. అంతేకాదు, గతంలో ఎప్పుడూ ఎన్నికల్లో పోటీచేయని వ్యక్తి ఈసారి బరిలోకి దిగుతున్నారని చెప్పడం ద్వారా అది మరెవరో కాదని, అది ఆయన భార్య సునేత్రేనని చెప్పకనే చెప్పినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

read also : Eknath Shinde Revanth : రేవంత్ రెడ్డి ని ఏక్‌నాథ్ షిండే తో పోల్చిన పాడి కౌశిక్‌ రెడ్డి