Rahul Gandhi : రాహుల్‌‌గాంధీ హత్యకు కుట్రపన్నారు.. పోలీసులకు కాంగ్రెస్ కంప్లయింట్

‘‘సెప్టెంబరు 11న రాహుల్‌ గాంధీకి(Rahul Gandhi) బీజేపీ నేత తర్విందర్ సింగ్ మార్వా, రైల్వేశాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ బిట్టు, శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్‌‌లు వార్నింగ్‌లు ఇచ్చారు.

Published By: HashtagU Telugu Desk
Rahul Gandhi Congress Ajay Maken

Rahul Gandhi : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని మర్డర్ చేసేందుకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అజయ్‌ మాకెన్‌ ఆరోపించారు.  ఆయన పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి దీనిపై ఇవాళ ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డు పోలీసు స్టేషనులో కంప్లయింట్ ఇచ్చారు. ఆ ఫిర్యాదు ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేశారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పలు కీలక వివరాలను ప్రస్తావించారు.

Also Read :NPS Vatsalya : ‘వాత్సల్య యోజన స్కీం’.. పిల్లల భవిష్యత్తు కోసం పెన్నిధి

‘‘పేదలు, దళితులు, మహిళలు, విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తుండటంతో ఆయనపై చాలామంది విమర్శలు చేస్తున్నారు. దాడులు చేస్తామని వార్నింగ్‌లు ఇస్తున్నారు. బీజేపీ, దాని మిత్రపక్షాల నుంచి రాహుల్‌కు ముప్పు ఉంది. అందుకే ఆయా పార్టీల నేతలు రాహుల్ గాంధీపై విషం చిమ్మేలా మాట్లాడుతున్నారు. దేశంలో అశాంతిని క్రియేట్ చేసేందుకు వాళ్లు కుట్రలు చేస్తున్నారు’’ అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ప్రస్తావించారు. ‘‘సెప్టెంబరు 11న రాహుల్‌ గాంధీకి(Rahul Gandhi) బీజేపీ నేత తర్విందర్ సింగ్ మార్వా, రైల్వేశాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ బిట్టు, శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్‌‌లు వార్నింగ్‌లు ఇచ్చారు. ఇష్టానుసారంగా రాహుల్‌ను తిట్టారు’’ అని కంప్లయింటులో పేర్కొన్నారు.

Also Read :Lalu Prasad : రైల్వే ఉద్యోగాల స్కాంలో లాలూకు షాక్.. కోర్టు కీలక ఆదేశాలు

‘‘భారత్‌లో రిజర్వేషన్ల వ్యవస్థను తొలగించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది. ఆయన నాలుకను ఎవరైనా కోస్తే రూ.11 లక్షల రివార్డు అందిస్తాను’’ అంటూ శివసేన ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌ కామెంట్ చేశారు.  అప్పట్లోనే గైక్వాడ్‌ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ఖండించింది. శివసేన నేతలే నిజమైన ఉగ్రవాదులని పేర్కొంది. రాహుల్‌ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు సంజయ్‌ గైక్వాడ్‌‌పై కేసు నమోదైంది. సంజయ్‌ గైక్వాడ్‌‌పై కాంగ్రెస్‌ శ్రేణులు బుల్దానా నగర పోలీస్‌ స్టేషన్‌లో కంప్లయింట్ ఇచ్చారు. మొత్తం మీద ఈ వివాదాస్పద వ్యాఖ్యలతో దేశంలో పెద్ద రాజకీయ దుమారమే రేగింది.

Also Read :Punjab Kings Coach: పంజాబ్ కింగ్స్‌కు కోచ్‌గా రికీ పాంటింగ్‌.. 7 ఏళ్ల‌లో ఆరుగురు కోచ్‌ల‌ను మార్చిన పంజాబ్‌..!

  Last Updated: 18 Sep 2024, 04:18 PM IST