Site icon HashtagU Telugu

Delhi: ఢిల్లీలో తారాస్థాయికి ఎయిర్ పొల్యూషన్, సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Cold Wave Conditions

Delhi Schools

Delhi: ఢిల్లీలో దీపావళికి ముందే వాయు కాలుష్యం తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో వాయుకాలుష్యానికి కారణమవుతున్న పంట వ్యర్థాలను తగలబెట్టడాన్ని తక్షణమే నిలిపివేయాలని పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాలను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. ప్రతి సంవత్సరం దేశ రాజధానిని కాలుష్యకారకంగా మార్చడం సరికాదని ఈ సమస్యకు పరిష్కారం కాదా? మీరు పట్టించుకోకపోతే తప్పు. ఢిల్లీలో వాయుకాలుష్యాన్ని నిరోధించేందుకు తగిన ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

రోజురోజుకు వాయుకాలుష్యం పెరిగిపోతుంటే పంట వ్యర్థాలను తగులబెట్టడం ఇంకా కొనసాగుతోందని, నివారణోపాయాలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశం రాజకీయ యుద్ధం కాకూడదని సూచించింది. పంట వ్యర్థాలను తగలబెట్టడాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పంట వ్యర్థాలను తగులబెట్టే చర్యలపై చర్చించేందుకు యూపీ, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాలతో బుధవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది.

‘పంట వ్యర్థాలను తగులబెట్టడం ఆపాలి. దాన్ని ఎలా ఆపాలో మాకు పట్టింపు లేదు. అయితే దీనిని తక్షణమే నిలిపివేయాలి, కాలుష్యం కారణంగా ప్రజలు చనిపోవడాన్ని మేము అనుమతించలేము” అని ధర్మాసనం పేర్కొంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే న్యాయస్థానాలు విధానపరమైన నిర్ణయాలకు దిగాల్సి వస్తుందని స్పష్టం చేసింది.

Exit mobile version