అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం (Air India Plane Crash) ప్రమాదానికి గురైన నేపథ్యంలో ఈ దుర్ఘటనకు కారణం రెండు ఇంజిన్ల ఫెయిల్యూర్ (Double engines failing) కావడమేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏవియేషన్ నిపుణుల ప్రకారం.. ఒకేసారి రెండు ఇంజిన్లు ఫెయిల్ కావడం అంటే అతి అరుదైన సంఘటన. ఈ పరిస్థితిలోనే పైలట్లు ‘మేడే’ కాల్ చేయడం సాధారణమని వారు పేర్కొన్నారు. పక్షుల ఢీకొనడం వల్ల ఇంజిన్లకు నష్టం జరిగి ఫెయిల్ అయ్యే అవకాశముందని, బ్యాకప్ ఇంజిన్ లేకపోవడం వల్ల పవర్ తగ్గిపోయి విమానం పూర్తి స్థాయిలో టేకాఫ్ కాలేక నేలకూలి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.
Warning : రౌడీలకు చంద్రబాబు హెచ్చరిక
ఈ విమానంలో 1.25 లక్షల లీటర్ల జెట్ ఫ్యూయల్ ఉన్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith Sha) తెలిపారు. విమానం కూలిన వెంటనే భారీ పేలుడు జరిగి మంటలు ఆకాశాన్ని అంటుకున్నాయని, అందులో ప్రయాణిస్తున్న వారిని రక్షించే అవకాశం లేకుండాపోయిందన్నారు. ప్రమాదానికి సంబంధించిన మృతదేహాల వెలికితీత దాదాపుగా పూర్తయ్యిందని, DNA పరీక్షల కోసం శాంపిళ్లు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రం ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించనున్నట్లు తెలిపారు.
Air crash incident : విమాన ప్రమాదంలో మృతులకు రూ.కోటి పరిహారం: టాటా గ్రూప్
ఈ ఘోర ప్రమాదంతో దేశం మొత్తంగా దిగ్భ్రాంతికి గురైనట్లు అమిత్ షా పేర్కొన్నారు. DNA పరీక్షలు పూర్తయ్యేంతవరకూ మృతుల ఖచ్చిత సంఖ్యను వెల్లడించలేమన్నారు. బాధిత కుటుంబాలకు కేంద్రం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే గుజరాత్ ప్రభుత్వం సహాయక చర్యలు ప్రారంభించిందని తెలిపారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారని, భరించలేని విషాదమని అభివర్ణించారని చెప్పారు. ప్రమాదం నుంచి ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డట్టు ఇప్పటివరకు సమాచారం అందిందని వెల్లడించారు.