Air India Flight Crash : అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభభాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. లండన్‌కి బయలుదేరుతున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ సమయంలో అదుపుతప్పి కూలిపోయింది. ఈ ప్రమాద సమయంలో విమానంలో సుమారు 133 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
లండన్‌కు వెళ్లే ప్రయాణికులతో నిండిన విమానం రన్‌వే పై వేగంగా దూసుకుపోతున్న సమయంలో ఒక్కసారిగా మిషన్ లోపం సంభవించి కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. ఈ దృశ్యం ఎయిర్‌పోర్ట్‌లో భయంకరమైన పరిస్థితులకు దారి తీసింది. 12 ఫైరింజన్లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి.
మంటల కారణంగా విమానాశ్రయం పరిసరాల్లో భారీగా పొగలు కమ్ముకున్నాయి. విమానాశ్రయంలోని ఇతర ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారని సమాచారం.
ప్రమాదానికి గల కారణాలపై అధికారికంగా ఎయిర్ ఇండియా ఇంకా ప్రకటన చేయలేదు. డీజీసీఏ (DGCA) ఆధ్వర్యంలో ఇప్పటికే విచారణ ప్రారంభమైంది. టెక్నికల్ లోపమా? లేక పైలట్ మానవ తప్పిదమా? అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది.
Etela Rajender : ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో నాలుగో స్థానానికి తెచ్చాం