Site icon HashtagU Telugu

Air India: మహిళపై మూత్ర విసర్జన చేసిన మందుబాబు.. విమానంలో ఘటన!

Istockphoto 1215111893 612x612

Istockphoto 1215111893 612x612

Air India: మందుబాబులు చేసే చాలా పనులు ఇతరులకు కోపం తెప్పిస్తుంటాయి. తాజాగా ఓ మందుబాబు విమానంలో తన తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన వార్త వైరల్ అవుతోంది. ఎయిర్ ఇండియా విమానంలో 2022 నవంబర్ 26వ తేదిన ఈ ఘటన జరిగింది. అయితే ఈ వార్త చాలా ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ వ్యక్తి చేసిన పనికి విమాన సిబ్బంది అతన్ని ఏం అనలేదు. పైగా మూత్ర విసర్జన చేసిన తన తోటి ప్రయాణికురాలికి విమాన సిబ్బంది జత బట్టలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.

ఈ ఘటనలో విమానం ల్యాండ్ అయిన తర్వాత కూడా విమాన సంస్థ ఆ వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆ మందుబాబు విమానం ల్యాండ్‌ అయ్యాక ఎంతో హుందాగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 2022 నవంబరు 26వ తేదిన న్యూయార్క్‌ నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిరిండియా విమానంలో ఓ వృద్ధురాలు బిజినెస్‌ క్లాసులో వెళ్తోంది. లైట్లు కూడా ఆర్పివేసి ఉన్న ఆ విమానంలో మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు ఆ వృద్ధురాలు కూర్చున్న సీటు వద్దకు వచ్చి ఆమెపై మూత్రవిసర్జన చేసేశాడు.

మూత్ర విసర్జన చేసినా అతను అక్కడి నుంచి వెళ్లలేదు. మరో ప్రయాణికుడు వచ్చి బలవంతంగా అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లాడు. తనకు జరిగిన ఘటన గురించి సదరు మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయింది. తన బట్టలు, బ్యాగు తడిచిపోయాయని ఆమె ఫిర్యాదు చేసింది. విమాన సిబ్బంది ఆమెకు ఓ జత బట్టలు, చెప్పులు ఇచ్చి డ్రెస్ ఛేంజ్ చేసుకోమని తెలిపారు.

ఎయిరిండియా విమాన సిబ్బంది తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ మహిళ ఆ సంస్థ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌కు లేఖను కూడా రాశారు. ఈ లేఖ తర్వాత ఎయిరిండియా ఈ ఘటనపై ఓ అంతర్గత కమిటీని ఏర్పాటు చేసి ఆ ప్రయాణికుడికి సరైన గుణపాఠం వేసింది. ఆ మందుబాబుని నో-ఫ్లై లిస్టులో చేర్చాలని డీజీసీఏకు సిఫార్సు చేసింది. ప్రస్తుతం దీనిపై డీజీసీఏ కమిటీ దర్యాప్తు చేయగా త్వరలోనే పూర్తి నివేదికను వెల్లడించనుంది.

Exit mobile version