Site icon HashtagU Telugu

Air India: మరో వివాదంలో ఎయిరిండియా.. ఈసారి భోజనంలో రాళ్లు?

Air India Stone

Air India Stone

Air India: ఇటీవల విమానాల్లో అనేక లోపాలు బయటపడుతున్నాయి. విమానాల్లో ప్రయాణికుల దాడులు, అనుచితంగా ప్రవర్తించడం లాంటి ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు ప్రయాణికులను భయపెడుతున్నాయి. అలాగే విమానాల్లో సర్వ్ చేసే ఫుడ్ విషయంలో కూడా అనేక లోటుపాట్లు వెలుగుూస్తున్నాయి. నాసిరకం ఫుడ్ ను ప్రయాణికులకు అందిస్తున్నారు. దీంతో ప్రయాణికులు విమాన సంస్థలపై మండిపడుతున్నారు.

తాజాగా ఎయిర్ ఇండియా విమానం భోజనంలో రాయి వచ్చింది. దీనిపై ప్యాసింజర్లు మండిపడుతున్నారు. ఓ ప్యాసింజర్ ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్ గా మారింది. విమానంలో రళ్లు లేని భోజనాన్ని కూడా ప్రయాణికులకు అందించలేరా? ఇంత నిర్లక్ష్యమేంటి? ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్లా అని సర్వప్రియ సంగ్వాన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఎయిర్ ఇండియాపై మండిపడుతున్నారు. ఖరీదైన సేవలు అందించే విమానంలో వడ్డించే భోజనంలో రాళ్లు ఏంటి అంటి ప్రశ్నిస్తున్నారు. విమాన సేవలు ఇటీవల దారుణంగా తయారు అయ్యాయని చెబుతున్నారు. రాయి ఉన్న ఆహారం తని మీ పన్ను విరిగిపోయి ఉంటుంది అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. అయితే ఈ ట్వీట్ పై ఎయిర్ ఇండియా స్పందించింది. ఈ విషయం తాము ఆందోళన చెందుతున్నామని, వెంటనే క్యాటరింగ్ టీం దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది.

ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చినందుకు అభినందనలు అని ఎయిర్ ఇండియా తెలిపింది. అయితే ఇటీవల ఎయిర్ ఇండియాలో ఓ మహిళపై ఓ వ్యక్తి మూత్రం పోసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.ఆ ఘటన మరవకముందే ఇప్పుడు ఎయిర్ ఇండియా విమానంలో భోజనంలో రాళ్లు రావడం కలకం రేపుతోంది. దీంతో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి.

Exit mobile version