Air India New Look : ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్ తనదైన శైలిలో దాన్ని వ్యాపారపరంగా తీర్చిదిద్దుతోంది. ఈక్రమంలోనే ఎయిర్ ఇండియా విమానాలను సరికొత్త లుక్ లోకి మారుస్తోంది. ఇప్పటికే ఈవిధంగా మార్చిన కొన్ని విమానాలను రంగంలోకి దింపింది. అయితే న్యూ లుక్ లోకి మార్చిన కొన్ని ఎయిర్ ఇండియా విమానాల ఫొటోలను తాజాగా శనివారం ట్విట్టర్ వేదికగా ఎయిర్ ఇండియా విడుదల చేసింది. ఈ ఫొటోలను బట్టి.. ఎయిర్ ఇండియా లోగో, ఎయిర్‌క్రాఫ్ట్ లివరీ (విమానాల రూపు)లో కొన్ని మార్పులు జరిగినట్లు కనిపిస్తోంది. ఫ్రాన్స్ లోని టౌలోసి వర్క్ షాప్ లో కొత్త లోగో, సరికొత్త డిజైన్ తో ఎయిర్ ఇండియా విమానాలను టాటా గ్రూప్ ముస్తాబు చేయించింది. ట్విట్టర్ లో షేర్ చేసిన వాటిలో A350 విమానాలు ఉన్నాయి. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join
Here's the first look of the majestic A350 in our new livery at the paint shop in Toulouse. Our A350s start coming home this winter… @Airbus #FlyAI #AirIndia #NewFleet #Airbus350 pic.twitter.com/nGe3hIExsx
— Air India (@airindia) October 6, 2023
టాటా గ్రూప్ కొన్న తర్వాత గత ఆగస్టులో ఎయిర్ ఇండియా కొత్త లోగో రిలీజ్ అయింది. ఈ లోగో తయారీపై టాటా గ్రూప్ దాదాపు 15 నెలల పాటు కసరత్తు చేసింది. దీనికోసం సొంతంగా ‘ఎయిర్ ఇండియా శాన్స్’ ఫాంట్‌ను డిజైన్ చేశారు. ఎయిర్ ఇండియా విమానంపై ఉన్న లోగోలోని ఎయిరిండియా ఫాంట్‌ను కూడా మార్చారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఎరుపు, ఊదారంగుతో కూడిన సరికొత్త డిజైన్‌లతో ఎయిర్ ఇండియా విమానాలు కనువిందు చేస్తున్నాయి. ఈవిధంగా మార్చిన లుక్ లో ఉన్న ఎయిర్ ఇండియా విమానాలు వచ్చే నెలలో లేదా డిసెంబరులో సర్వీసులను ప్రారంభిస్తాయని అంటున్నారు. 2025 నాటికి ఎయిరిండియాలోని అన్ని విమానాలను కొత్త లోగోలోకి మార్చనున్నామని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. 2026 చివరినాటికి ఎయిర్ ఇండియా పూర్తిగా సుదూర విమానాలను నడపాలని టార్గెట్ గా పెట్టుకుంది. కొత్త ఎయిర్ ఇండియా వెబ్ సైట్,మొబైల్ యాప్, లాయల్టీ ప్రోగ్రామ్, రీపిటెడ్ ఇంటీరియల్ ను దశలవారీగా ప్రారంభించేందుకు ప్లానింగ్ ను (Air India New Look) కూడా సిద్ధం చేస్తోంది.