Flight emergency landing: ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్.. 143 మంది ప్రయాణికులు సేఫ్

హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా (Air India) A320 విమానంలో సాంతికేక సమస్య తలెత్తింది. విమానాన్ని ముంబై విమానాశ్రయానికి మళ్లించటంతో ప్రమాదం తప్పింది. ఎయిర్‌ ఇండియా (Air India) విమానంలో హైడ్రాలిక్‌ సిస్టంలో సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు.

  • Written By:
  • Updated On - December 18, 2022 / 09:23 AM IST

హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా (Air India) A320 విమానంలో సాంతికేక సమస్య తలెత్తింది. విమానాన్ని ముంబై విమానాశ్రయానికి మళ్లించటంతో ప్రమాదం తప్పింది. ఎయిర్‌ ఇండియా (Air India) విమానంలో హైడ్రాలిక్‌ సిస్టంలో సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు. విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారని చెప్పారు. విమానంలో 143 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. ఎయిర్ ఇండియా విమానం ఏఐ-951 (హైదరాబాద్-దుబాయ్)లో ఈ ఘటన చోటుచేసుకుంది. అందులో 143 మంది ప్రయాణికులు ఉన్నారు.

కాగా ఇలాంటి ఘటనే ఈ నెల 2న కూడా జరిగింది. డిసెంబర్‌ 2న కన్నౌర్‌ నుంచి దోహా వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తటంతో, విమానాన్ని ముంబైకి మళ్లించారు. విమానంలో 143 మంది ప్రయాణికులు ఉన్నారని, ఈ ఘటన మధ్యలోనే జరిగిందని ఎయిర్‌లైన్స్ తెలిపింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, దానిని బేలోకి లాగుతున్నామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) అధికారులు తెలిపారు.

Also Read: statue of Vladimir Putin: అభ్యంత‌ర‌క‌ర రీతిలో ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ విగ్ర‌హం

ఆపరేటింగ్ సిబ్బంది సాంకేతిక సమస్యను గుర్తించి అవసరమైన నిర్వహణ కోసం విమానాన్ని ముంబైకి మళ్లించారు. ప్రయాణీకులను వారి తదుపరి ప్రయాణం కోసం ప్రత్యామ్నాయ విమానంలో పంపినట్లు తెలిపారు. గతంలో ఇలాంటి ఘటనలో జెడ్డా నుంచి కోజికోడ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానాన్ని కూడా సాంకేతిక కారణాలతో కొచ్చికి మళ్లించారు. అయితే ప్రయాణికులంతా క్షేమంగా ఉండడంతో మరో విమానంలో ఎక్కించారు.