Air India: దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయం (Delhi Airport) నుండి లండన్‌కు ప్రయాణించే ఎయిరిండియా (Air India) విమానం సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ నిలిపివేయబడింది. గురువారం ఢిల్లీ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. AI2017 ఎయిరిండియా విమానం టెక్నికల్ ఎర్రర్ అనుమానంతో పైలెట్లు టేకాఫ్‌ను నిలిపివేసి, ప్రామాణిక విధానాలను అనుసరించి ముందు జాగ్రత్తగా తనిఖీలు నిర్వహించారు.
“జూలై 31న ఢిల్లీ నుండి లండన్‌కు వెళ్లాల్సిన AI2017 విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించిన కాక్‌పిట్ సిబ్బంది టేకాఫ్‌ను నిలిపివేశారు. ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించి, విమానాన్ని తిరిగి తీసుకువచ్చి జాగ్రత్తగా తనిఖీలు చేపట్టారు” అని ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు.
ప్రయాణికులను త్వరగా లండన్‌కు తరలించేందుకు ప్రత్యామ్నాయ విమానం సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలియజేశారు. ఈ ఆలస్యం కారణంగా ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించేందుకు ఎయిరిండియా సిబ్బంది అన్ని రకాల మద్దతును మరియు సంరక్షణను అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రత మరియు శ్రేయస్సే తమకు అత్యంత ప్రాముఖ్యమని ఆ ప్రతినిధి తెలిపారు.