ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు ఒక పెద్ద ప్రమాదం తప్పింది. టెర్మినల్-3 వద్ద పార్క్ చేసి ఉన్న విమానానికి సమీపంలో ప్రయాణికులను తరలించే బస్సు ఒక్కసారిగా మంటలు అంటుకున్నది. ఘటనా స్థలాన్ని వెంటనే సిబ్బంది ఖాళీ చేసి ఫైర్ సర్వీస్‌లకు సమాచారం అందించారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. కొద్దిసేపటికే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
Dharma Vijaya Yatra : శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామీజీ ఆశీస్సులు తీసుకున్న సీఎం రేవంత్
ఈ ఘటన ఎయిర్ ఇండియా సొంతమయిన ప్రయాణికుల రవాణా బస్సులో చోటు చేసుకున్నట్లు సమాచారం. బస్సు పార్కింగ్ ప్రాంతం నుండి టెర్మినల్‌కి ప్రయాణికులను తీసుకువెళ్లే సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. బస్సు ఇంజిన్ భాగంలో టెక్నికల్ లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే సిబ్బంది క్షిప్రంగా స్పందించి మంటలు విమానానికి వ్యాపించకుండా నిరోధించడం ద్వారా పెద్ద అపాయాన్ని నివారించారు. విమాన సిబ్బంది, భద్రతా సిబ్బంది సమన్వయంతో పరిస్థితిని పూర్తిగా నియంత్రణలోకి తెచ్చారు.
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అధికారులు ఈ ప్రమాదంపై దర్యాప్తు ఆదేశించారు. ఏవైనా భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించబడ్డాయా అనే దానిపై విచారణ జరుగుతోంది. ఎయిర్ ఇండియా సంస్థ ప్రతినిధులు ఈ ఘటనపై స్పందిస్తూ, “ఏ ప్రయాణికుడికీ గాయాలు కాలేదు, మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చాం” అని వెల్లడించారు. విమానాశ్రయంలో సిబ్బంది చాకచక్యంగా స్పందించకపోతే పరిస్థితి విషమించేది అని ప్రయాణికులు వ్యాఖ్యానించారు. ఈ ఘటన భవిష్యత్తులో భద్రతా చర్యలను మరింతగా కట్టుదిట్టం చేయాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది.
