Air India : ఎయిర్ ఇండియాలో 55+ ఉద్యోగులు ఔట్‌

  • Written By:
  • Publish Date - June 2, 2022 / 05:00 PM IST

ఎయిరిండియాలో 55 సంవత్సరాల వయస్సున్న(గతంలో 40 ఏళ్లు) క్యాబిన్‌ క్రూ సిబ్బందితో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ తీసుకోవచ్చని తీసుకోవచ్చని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ప్రస్తుతం ఏవియేషన్‌ సెక్టార్‌లోని పరిస్థితులకు తగ్గట్టుగా ఎయిరిండియాను తీర్చిదిద్దడానికి టాటా గ్రూప్‌ అధినేత రతన్‌ టాటా స‌న్న‌ద్ధం అయ్యారు. ఆ క్ర‌మంలో సంచ‌ల‌న నిర్ణ‌యం ఆయ‌న తీసుకున్నారు. ఎవరైతే జూన్‌1 నుంచి జులై 31వరకు స్వచ్ఛంద రాజీనామా చేస్తారో ఆ ఉద్యోగులకు ప్రత్యేకంగా టాటా గ్రూప్‌ ఎక్స్‌ గ్రేషియా, బోనస్‌లు ఇవ్వనున్నట్లు ఎయిరిండియా చీఫ్‌ హెచ్‌ ఆర్‌ విభాగం అధికారి సురేష్‌ దత్‌ త్రిపాటీ వెల్ల‌డించారు.

గతేడాది బిడ్‌ జరిగిన అక్టోబర్‌ నెలలో ఉద్యోగుల వీఆర్‌ఎస్‌, తొలగింపుపై ఎయిరిండియా ముందస్తుగానే తెలిపింది. ఆనాటి లెక్కల ప్రకారం, ఎయిరిండియాలో మొత్తం 12,085 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 8,084మంది పర్మినెంట్‌ ఉద్యోగులు, 4,001 కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, ఎయిరిండియా ఎక్స్‌ ప్రెస్‌లో 1,534 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్లు ఓ నివేదికను విడుదల అయింది. కేంద్రం నిర్వహణలో ఉన్న ఎయిరిండియాను తాము దక్కించుకుంటే సంవత్సరం పాటు ఉద్యోగులు విధుల్లో కొనసాగుతారని ఆనాడు చెప్పారు. రెండో ఏడాదిలో ఉద్యోగులు తొలగించడం, వీఆర్‌ఎస్‌కు అనుమతిస్తామని చెప్పిన విధంగానే 55 ఏళ్ల పై బ‌డిన వాళ్ల‌ను వ‌దిలించుకోనుంది.

ఎయిరిండియాలో వచ్చే 5 ఏళ్లలో సంవత్సరానికి వెయ్యి మంది చొప్పున మొత్తం 5వేల మంది ఉద్యోగులు రిటైర్‌ కానున్నార‌ని నివేదిక చెబుతోంది. ఇక వీఆర్‌ఎస్‌ తీసుకోవాల్సిన వారిలో పర్మినెంట్‌ ఉద్యోగులతో పాటు, ఎయిరిండియా ఎక్స్‌ ప్రెస్‌లో పైలెట్‌లను మినహాయించి మిగిలిన విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు వర్తించనుంది. ఈ వీఆర్‌ఎస్‌ నిర్ణయంపై ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.