Site icon HashtagU Telugu

Suicide : కోల్‌క‌తాలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఎయిర్ హోస్టెస్‌

Deaths

Deaths

కోల్‌క‌తాలో ఓ ఎయిర్ హోస్టెస్ ఆత్మ‌హ‌త్య చేసుకుంది. తాను నివాస‌ముంటున్న భవనంలోని నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలిని 27 ఏళ్ల దేబోప్రియ బిస్వాస్‌గా గుర్తించారు. కోల్‌కతాలోని ప్రగతి మైదాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్రోపాలిటన్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో దేబో ప్రియ బిశ్వాస్ నివాసం ఉంటున్నారు. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆమె నివాసముంటున్న నాలుగు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఇంటి ముందు రోడ్డుపై పడి తీవ్ర గాయాలపాలైనట్లు పోలీసులు తెలిపారు. ఆమెను ఎస్‌ఎస్‌కెఎం మెడికల్ కాలేజీ మరియు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స ప్రారంభించారు, అయితే ఆమె వెంటనే మరణించిందని నోలీసులు తెలిపారు. ఆసుపత్రి అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో స్థానిక పోలీసు స్టేషన్‌కు చెందిన బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. గత రెండేళ్లుగా ఉద్యోగం లేక‌పోవ‌డంతో డిప్రెష‌న్‌కు గురైన‌ట్లు ఆమె కుటుంబసభ్యులు పోలీసుల‌కు తెలిపారు. కోల్‌కతాలోని ప్రగతి మైదాన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version