AIIMS Research: చనిపోయినా.. స్పెర్మ్ పంతొమ్మిదిన్నర గంటలు జీవించగలదు: వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. తాజా పరిశోధనలో చనిపోయిన వ్యక్తి శుక్రకణాలు పంతొమ్మిదిన్నర గంటలు జీవించగలవని తేలింది. భోపాల్‌లోని ఎయిమ్స్‌లో నిర్వహించిన పరిశోధనలో చనిపోయిన వ్యక్తి శరీరం నుంచి సేకరించిన శుక్రకణాలు పంతొమ్మిదిన్నర గంటలపాటు జీవించగలవని తేలింది. దీంతో ఏ స్త్రీ అయినా తల్లి కాగలదని నిర్దారణ అయ్యింది. .
భోపాల్‌లోని ఎయిమ్స్ (AIIMS) లోని ఫోరెన్సిక్ మెడిసిన్ మరియు టాక్సికాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రాఘవేంద్ర కుమార్ విదువా మరియు అతని బృందం పోస్ట్‌మార్టం స్పెర్మ్ రిట్రీవల్‌పై ఒక అధ్యయనం నిర్వహించారు. ఇందులో పోస్టుమార్టం అనంతరం 125 మంది మృతదేహాల నుంచి స్పెర్మ్‌లను సేకరించి భద్రపరిచారు. ఇందులో 47.22 శాతం మంది స్పెర్మ్ సజీవంగా ఉన్నట్లు తేలింది. దేశంలోనే తొలిసారిగా భోపాల్‌లోని ఎయిమ్స్‌లో చనిపోయిన వ్యక్తులపై ఈ తరహా పరిశోధనలు చేశామని డాక్టర్ రాఘవేంద్ర కుమార్ తెలిపారు. ఈ పరిశోధన గ్రీస్‌లోని ఏథెన్స్‌లో జరిగిన 26వ ట్రైనియల్ ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ మెడిసిన్ కాన్ఫరెన్స్‌లో చేర్చబడింది.
న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సహకారంతో ఈ పరిశోధన 2022లో ప్రారంభించబడిందని, ఇందులో ప్రత్యేకంగా 47.22 శాతం కేసుల్లో లైవ్ స్పెర్మ్‌ని పొందామని, వీటిని IVF ప్రక్రియలో ఉపయోగించవచ్చని డాక్టర్ కుమార్ తెలిపారు. . ఈ కొత్త పద్ధతికి సంబంధించిన పేటెంట్ కోసం ఐసీఎంఆర్‌కు దరఖాస్తు పంపగా, త్వరలోనే పేటెంట్ పొందే అవకాశం ఉంది.
Also Read: Ram – Rana : ముంబై డిన్నర్‌లో రామ్, రానా.. వెబ్ సిరీస్ ప్లానింగ్..!