Independence Day 2024: దేశ ప్రధాని నరేంద్ర మోడీ తన సోషల్ మీడియా ఖాతాల డీపీ ఫోటోలను మార్చారు. తన ప్రొఫైల్ పిక్చర్‌లో తన ఫోటోకి బదులుగా జాతీయ జెండాను చేర్చారు. ఈ సందర్భంగా దేశ ప్రజలు మోడీ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరు తమ సోషల్ మీడియా ఖాతాలో డీపీ ఫోటోలో జాతీయ జెండాను చేర్చాలని ఆయన కోరారు.
77వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు త్రివర్ణ పతాకాన్ని తమ డిపిలో పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోషల్ ఖాతాలు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ తదితర సోషల్ ఖాతాలో త్రివర్ణ పతాకాన్ని పెట్టాల్సిందిగా మోడీ కోరారు. అయితే మోడీ అభ్యర్థనకు విశేషం స్పందన లభిస్తుంది. ఇప్పటికే ఎంతో మంది తమ డీపీ పిక్ లను జాతీయ జెండాతో కనివిందు చేశారు.దీంతో పాటు దేశప్రజలు తప్పనిసరిగా త్రివర్ణ పతాకంతో తమ సెల్ఫీని https://harghartirang.comలో పంచుకోవాలని ఆయన అన్నారు.
ఈ సంవత్సరం హర్ ఘర్ తిరంగ అభియాన్ మూడవ ఎడిషన్ ఆగస్టు 9 నుండి ఆగస్టు 15 వరకు నిర్వహించబడుతుంది. ప్రజలు తమ ఇళ్లలో త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేయాలనీ కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గురువారం విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాక ర్యాలీలు నిర్వహించాలని అధికార బీజేపీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేసింది.
Also Read: Manish Sisodia: ఢిల్లీ ముఖ్యమంత్రిగా మనీష్ సిసోడియా?