Agniveer Recruitment: ఆర్మీ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల!

గత కొన్ని రోజుల నుండి దేశవ్యాప్తంగా అగ్నిపత్ పతాకంపై జరుగుతున్న ఘర్షణ చూస్తూనే ఉన్నాం. పలు చోట్ల కూడా తీవ్రమైన సంఘటన కూడా చోటు చేసుకుంది. ఆ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపత్ పథకంపై బాగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయినా కూడా అగ్నిపత్ పై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని త్రివిధ దళాల ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇక తాజాగా సైన్యంలో సరాసరి వయస్సు తగ్గించే లక్ష్యంతో ఈ సంస్కరణలు తీసుకొస్తున్నట్లు […]

Published By: HashtagU Telugu Desk
000

000

గత కొన్ని రోజుల నుండి దేశవ్యాప్తంగా అగ్నిపత్ పతాకంపై జరుగుతున్న ఘర్షణ చూస్తూనే ఉన్నాం. పలు చోట్ల కూడా తీవ్రమైన సంఘటన కూడా చోటు చేసుకుంది. ఆ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపత్ పథకంపై బాగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయినా కూడా అగ్నిపత్ పై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని త్రివిధ దళాల ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

ఇక తాజాగా సైన్యంలో సరాసరి వయస్సు తగ్గించే లక్ష్యంతో ఈ సంస్కరణలు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. జులై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతున్నాయని తెలిపింది. అగ్ని వీరులు గా నియామకాలు చేపట్టే విభాగాలు, అర్హతలను కూడా తెలిపింది. ఇక వారి ప్యాకేజీ, సెలవులు, సర్వీసుల గురించి కూడా నోటిఫికేషన్లో తెలిపింది.

అంతేకాకుండా వాయుసేన, ఇండియన్ నేవీ లకు సంబంధించిన అగ్నివీర్ నియామక నోటిఫికేషన్లను కూడా త్వరలో విడుదల చేస్తామని ప్రకటించారు. ఇక నాలుగేళ్ల తర్వాత బయటికి వచ్చే అగ్ని వీరులకు రక్షణ శాఖ, కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లో పది శాతం చొప్పున ప్రాధాన్యం కల్పిస్తామని కేంద్రం ప్రకటించింది. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పిడిఎఫ్ లీస్ట్ కూడా ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక అందులో అన్ని రకాలుగా అన్ని వివరాలను పూర్తిగా పొందుపరిచారు కేంద్రం.

  Last Updated: 20 Jun 2022, 04:48 PM IST