భారత నౌకాదళం (Indian Navy) అగ్నిపథ్ పథకం ద్వారా మ్యూజిషియన్ విభాగంలో అగ్నివీర్ నియామకాలకు నోటిఫికేషన్ (Agniveer Notification) విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియలో పెళ్లి కాని యువతి, యువకులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే 1-09-2004 నుంచి 29-02-2008 మధ్య జన్మించి ఉండాలి. మ్యూజిక్ రంగంలో అనుభవం లేదా శిక్షణ ఉన్నవారికి ఇది మంచి అవకాశం.
Japan : అగ్నిపర్వతం బద్దలైంది, భూమి కంపించింది.. జపాన్‌లో రియో జోస్యం నిజమవుతుందా?
ఈ నియామకాల్లో అభ్యర్థులు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మ్యూజికల్ స్కిల్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ వంటి దశల్లో ఎంపిక చేయబడతారు. మ్యూజిక్ కు సంబంధించి పట్టు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు దేశ సేవలో భాగమవుతూ, నౌకాదళంలో ప్రత్యేకమైన పాత్ర పోషించనున్నారు. మ్యూజిక్‌ను నైపుణ్యంగా వినిపించగలిగే యువతీ యువకులకు ఇది అరుదైన అవకాశంగా నిలవనుంది.
ఈ అగ్నివీర్ మ్యూజిషియన్ నియామకాలకు దరఖాస్తు చేసుకునే చివరి తేదీ జూలై 13, 2025. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు లేదా సెప్టెంబర్ లోగా నియామక ఉత్తర్వులు జారీ అవుతాయి. దేశ సేవతో పాటు మ్యూజిక్‌కి ప్రాధాన్యత ఇచ్చే యువతీ యువకులకు ఇది ఉత్తమ అవకాశంగా చెబుతున్నారు నౌకాదళ అధికారులు.