Agniveer : ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టులు.. అప్లై చేసేయండి

Agniveer :  పదోతరగతి పాసైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులకు ఉద్యోగ అవకాశం.

  • Written By:
  • Updated On - May 6, 2024 / 03:08 PM IST

Agniveer :  పదోతరగతి పాసైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులకు ఉద్యోగ అవకాశం. నేవీలో అగ్నివీర్(ఎంఆర్‌-మెట్రిక్ రిక్రూట్) పోస్టులను భర్తీ చేసేందుకు  నోటిఫికేషన్ రిలీజైంది. ఇందులో భాగంగా ఎంపికయ్యే అగ్నివీరులకు ఒడిశా తీరంలోని ఐఎన్‌ఎస్‌ చిల్కాలో ట్రైనింగ్ ఉంటుంది. 2024 నవంబరు నుంచి వీరికి ట్రైనింగ్ మొదలవుతుంది.  ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

నేవీలో అగ్నివీర్(ఎంఆర్‌) పోస్టుల వివరాలివీ.. 

  • మే 13 నుంచి మే 27 వరకు అర్హులైన అభ్యర్థుల(Agniveer) నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.
  • కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీఈ), రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • పురుషులు 157 సెం.మీ., మహిళలు 152 సెం.మీ ఎత్తును కలిగి ఉండాలి.
  •  2003 నవంబరు1 నుంచి 2007 ఏప్రిల్ 30 మధ్య జన్మించిన వారు అప్లై చేయొచ్చు.
  • దరఖాస్తు ఫీజు: రూ.550.
  • అభ్యర్థులు నేవీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా అప్లై చేయాలి.

Also Read : Rahul Gandhi : మరో వివాదంలో చిక్కుకున్న రాహుల్‌ గాంధీ

  • షార్ట్‌లిస్టింగ్, కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీఈ), రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష(పీఎఫ్‌టీ), వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • ప్రశ్నపత్రం హిందీ/ ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది. మొత్తం 50 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలతో ఒక్కొక్కటి 1 మార్కు చొప్పున 50 మార్కులను కలిగి ఉంటుంది. సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్ విభాగాల్లో పదో తరగతి స్థాయిలో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 30 నిమిషాలు. నెగెటివ్ మార్కింగ్ అమలులో ఉంటుంది. నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కును కట్ చేస్తారు.
  • అభ్యర్థులు ట్రైనింగ్ పూర్తయ్యాక ఆయా విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
  • అభ్యర్థులకు మొదటి ఏడాది ప్రతినెలా రూ.30,000, రెండో ఏడాది ప్రతినెలా రూ.33,000, మూడో ఏడాది ప్రతినెలా రూ.36,500, నాలుగో ఏడాది ప్రతినెలా రూ.40,000 చొప్పున శాలరీ ఇస్తారు.

Also Read : OTT Movies : ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు.. ఇవే