Site icon HashtagU Telugu

Agnipath Eligibility: అగ్నిపథ్ అర్హతలు ఇవే.. వివరాలు విడుదల చేసిన కేంద్రం!

agneepath

0000

ప్రస్తుతం అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా హింసాత్మక యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం ఈ పథకం గురించి నాలుగేళ్లపాటు అగ్నివీర్ గా దేశానికి సేవలు అందించే పథకం వివరాలు ప్రకటించింది. తాజాగా ఎయిర్ ఫోర్స్ ఈ ప్రకటనను విడుదల చేయగా.. ఈ నెల 24 నుంచి రిక్రూట్ మెంట్ ప్రక్రియ ప్రారంభించేందుకు సన్నాహాలు చేపట్టింది.

ఎయిర్ ఫోర్స్ పరిధిలో వివరాలను పరిశీలిస్తే మాత్రం అందులో భిన్నమైన యూనిఫామ్ తో ఉంటారని.. అవార్డులకు, సత్కార్యాలకు అర్హులని, అగ్నివీర్ కు సంబంధించిన నైపుణ్యాలు, అర్హతలు, ఆన్లైన్ డేటాబేస్ నిర్వహిస్తారని ప్రకటించింది. 17.5 నుండి 21 ఏళ్ల వరకు దీని కోసం పోటీ పడొచ్చని.. అన్ని రకాల షరతులను అంగీకరించారని, ఇక 18 ఏళ్ల లోపు వారికి తల్లిదండ్రుల షరతులు, అధికార పత్రం పై సంతకం చేయాల్సి ఉంటుంది అని ప్రకటించింది.

ఇక ఇందులో నాలుగేళ్ల సర్వీస్ తర్వాత వారిని విడుదల చేశాక అందులో అత్యంత ప్రతిభ, నైపుణ్యాలను ప్రదర్శించిన వారికి ఐఏఎస్ రెగ్యులర్ కేడర్ కు దరఖాస్తు చేసుకునే అనుమతి కూడా ఉందని.. ఈ కేడర్లో 25 శాతం కోటా ఉంటుంది అని.. అంతేకాకుండా ఇతర అభ్యర్థులతో సమానంగా పోటీ పడే అవకాశం ఉంటుందని తెలిపింది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, కంటి సమస్యలు ఉండకూడదు అని తెలిపింది.

ఇందులో ఎంపికైన వారికి ఐఏఎఫ్ లో ఏ బాధ్యతలైనా అప్పగిస్తారని తెలిసింది. సంవత్సరానికి 30 రోజులతో పాటు సిక్ లీవ్ కూడా ఉంటుందని.. వైద్య సదుపాయాలు ఉచితంగా అందిస్తామని తెలిపింది. ఇక అసాధారణ కేసుల్లో కాకుండా నాలుగేళ్లు పూర్తి కాకుండా ఉద్యోగం నుంచి వెళ్లి పోవడానికి అనుమతించరని పేర్కొంది.

ఇక వచ్చే ఆదాయం గురించి కూడా కొన్ని వివరాలు అందివ్వగా.. నాలుగేళ్లలో అగ్నివీర్ తన వంతు రూ.5.02 లక్షలు పొదుపు చేస్తారని.. ప్రభుత్వం కూడా ఇంతే మొత్తాన్ని అందిస్తుంది అని.. నాలుగేళ్ల తర్వాత రూ. 10.04 లక్షలు, వడ్డీ కలిపి చెల్లిస్తారు అని తెలిపింది. ముఖ్యంగా ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ ఉండదు అని తెలిపింది.