Site icon HashtagU Telugu

700 Crore: భారత్ బయోటెక్ “ముక్కు టీకా” ప్రయోగ పరీక్షలు పూర్తి

Train Fire

Train Fire

“అగ్నిపథ్” స్కీం కు వ్యతిరేకంగా బీహార్ లో జరిగిన నిరసనల వల్ల రైల్వేకు తీవ్ర నష్టం జరిగింది. ఆ ఒక్క రాష్ట్రంలోనే రైల్వేశాఖకు దాదాపు రూ.700 కోట్ల విలువైన ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. గత 4 రోజుల్లో నిరసనకారులు 60 రైళ్లకు చెందిన కోచ్ లకు, 11 ఇంజిన్లకు నిప్పు పెట్టారు.

బీహార్ లోని 15 జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక రైల్వే కోచ్ తయారీకి రూ.80 లక్షల దాకా ఖర్చవుతుంది. స్లీపర్ కోచ్ తయారీకి కోటిన్నర, ఏసీ కోచ్ తయారీకి మూడున్నర కోట్ల ఖర్చవుతుంది.ఒక రైలు ఇంజిన్ తయారీకి రూ.20 కోట్లు వెచ్చించాల్సి వస్తుంది.12 కోచ్ ల ప్యాసింజర్ రైలు ధర రూ.40 కోట్లు.. 24 కోచ్ ల రైలు ధర రూ.70 కోట్లకు పైనే ఉంటుంది. సంభవించిన నష్టానికి సంబంధించి సమగ్ర నివేదిక తయారు చేసే పనిలో రైల్వేశాఖ నిమగ్నమైంది. బీహార్ నిరసనల వల్ల అకస్మాత్తుగా 60 కోట్ల మంది టికెట్లు క్యాన్సల్ చేసుకున్నారు. రైళ్ల రద్దు, దారి మల్లింపు నష్టాలను మరింత పెంచింది. ఈ ఘటనలకు సంబంధించి శనివారం బీహార్ లో మరో 25 ఎఫ్ ఐ ఆర్ లు నమోదయ్యాయి.

నిరసనలతో సంబంధమున్న దాదాపు 250 మందిని అరెస్టు చేశారు.గత 3 రోజుల్లో బీహార్ పరిధిలో మొత్తం 138 ఎఫ్ ఐఆర్ లు నమోదవగా, 718 మందిని అరెస్టు చేశారు.

Exit mobile version