Site icon HashtagU Telugu

Agnipath Effect: పోలీసులు అలెర్ట్.. అల్లర్లను, విధ్వంసాన్ని సృష్టించారో అంతే సంగతులు!

0000

0000

అగ్నిపథ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతి చోటా ప్రస్తుతం అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే.. అయితే గత రెండు రోజులుగా భారత్ బంద్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయ్. ఇక ఈ నేపథ్యంలోనే తిరువంతపురంలో కూడా అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం భారత్ బంద్ కు కొన్ని సంస్దలు పిలుపునిచ్చాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయ్.

దీంతో కేరళ డీజీపీ మొత్తం పోలీస్ ఫోర్స్ ను రేపు అంత రాష్ట్రంలో ఎక్కడ అల్లర్లు జరగకుండా ఉండాలని భద్రతాపరమైన జాగ్రత్తలు పూర్తిగా తీసుకోవాలని కేరళ డీజీపీ అనిల్ కాంత్ ఆదేశించారు. అంతేకాదు వ్యాపారాలు చేసుకునేవారిని బంద్ చెయ్యాలని ఎవరు ఇబ్బంది పెట్టిన సరే వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు.

అన్ని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు కోర్టులు, KSEB కార్యాలయాలు, KSRTC బస్సులు ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు అన్ని సంస్థలకు తగిన పోలీసు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటారని, ప్రైవేట్ బస్సులకు కూడా పోలీసులు భద్రత కల్పిస్తారని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు రాత్రి నుంచే అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీసు పెట్రోలింగ్‌ నిర్వహించనున్నారు.

Exit mobile version