Site icon HashtagU Telugu

Against Modi Govt : అవిశ్వాసంకు స్పీక‌ర్ ఆమోదం, నెంబ‌ర్ గేమ్ లో విప‌క్ష కూట‌మి

Against Modi Govt

Against Modi Govt

ప్ర‌ధాని మోడీపై విప‌క్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని (Against Modi Govt)స్పీక‌ర్ ఓంప్ర‌కాష్ బిర్లా ఆమోదించారు. చ‌ర్చ‌కు స‌మ‌యం డిసైడ్ చేసి చెబుతాన‌ని హామీ ఇచ్చారు. దీంతో ఇరు పక్షాల బ‌లాబ‌లాల‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. మొత్తం 543 స్థానాల‌కుగాను, ఆరు ఎంపీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే, 537 మంది ఎంపీలు లోక్ స‌భ‌లో ప్ర‌స్తుతం ఉన్నారు. వాళ్ల‌లో ఎన్డీయే ప‌క్షానికి 331 మంది ఎంపీలు అనుకూలంగా ఉన్నారు. వీళ్ల‌లో సొంత పార్టీ ఎంపీలు 301 మంది బీజేపీకి ఉండ‌డం విశేషం. ఆ పార్టీ వైసీపీ ఎంపీలు 22 మంది మ‌ద్ధ‌తు ఉంటుంది.

అవిశ్వాస తీర్మానాన్ని స్పీక‌ర్ ఓంప్ర‌కాష్ బిర్లా ఆమోదించారు(Against Modi Govt)

విప‌క్ష కూట‌మి ఇండియాకు ప్ర‌స్తుతం 142 మంది ఎంపీల బ‌లం ఉంది. విప‌క్ష కూట‌మిలో లేకుండా బ‌య‌ట నుంచి మ‌ద్ధ‌తు ఇచ్చే పార్టీలు బీఆర్ ఎస్, ఎంఐఎం. ఆ రెండు పార్టీల‌కు 11 మంది ఎంపీలు ఉన్నారు. ఇంకా నిర్ణ‌యం తీసుకోని పార్టీల ఎంపీలు 31 మంది ఉన్నారు. వాళ్లంద‌రూ ఇండియా కూట‌మికి మ‌ద్ధ‌తు ఇచ్చిన‌ప్ప‌టికీ అవిశ్వాసం వీగిపోయే అవ‌కాశం ఉంది. మ్యాజిక ఫిగ‌ర్ 272 మాత్ర‌మే కావ‌డంతో అవిశ్వాసం (Against Modi Govt)వీగిపోతుంద‌ని అంద‌రికీ తెలిసిందే. కానీ, దేశంలోని ప‌రిస్థితుల‌పై చ‌ర్చంచ‌డానికి అవ‌కాశం ఉంటుంద‌ని విప‌క్ష కూట‌మి ఆలోచ‌న‌గా ఉంది. అందుకే, అవిశ్వాస తీర్మానం పెట్టడం జ‌రిగింది.

చర్చకు తేదీ, సమయాన్ని నిర్థారించ‌డానికి

నిబంధనల ప్రకారం 50 మందికిపైగా ఎంపీలతో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అందించారు. దాన్ని అంగీక‌రించిన స్పీక‌ర్ చర్చకు సమయం నిర్ణయించి సభకు తెలియజేస్తాన‌ని హామీ ఇచ్చారు. బుధ‌వారం మధ్యాహ్నం 12 గంటలకు సభ సమావేశమైన త‌రువాత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం గొగోయ్ పెట్టారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా సహా భారత కూటమి సభ్యుల గణన కోసం లేచి నిలబడాలని స్పీక‌ర్ కోరారు. క‌నీసం 50 మందికి పైగా స‌భ్యులు అవిశ్వాసంకు మ‌ద్ధ‌తు ఇస్తూ నిల‌బ‌డ‌డంతో బిర్లా కేంద్ర మంత్రి మండలిపై విశ్వాసం కోరుతూ తీర్మానాన్ని అంగీకరించారు.అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపిన తర్వాత దానిపై చర్చకు తేదీ, సమయాన్ని నిర్థారించ‌డానికి (Against Modi Govt)సిద్ధ‌ప‌డ్డారు.

అవిశ్వాసం తీర్మానం నోటీస్ కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్

వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి మ‌ణిపూర్ హింసాకాండపై చ‌ర్చ‌కు విప‌క్ష కూట‌మి ప‌ట్టుబ‌ట్టింది. వాయిదా తీర్మానాలను ఇస్తున్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం నుంచి సానుకూల స్పంద‌న ల‌భించ‌లేదు. ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీ మ‌ణిపూర్ ఘ‌ట‌న‌ల‌పై మాట్లాడాల‌ని ప‌లుమార్లు విప‌క్ష ఎంపీలు ప‌ట్టుబ‌ట్టారు. వాళ్ల‌లో బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది. ప్ర‌భుత్వంపై అవిశ్వాసం తీర్మానం నోటీస్ కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ కూడా ఇచ్చింది. ఆ పార్టీ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు స్పీక‌ర్ కు నోటీస్ అందించారు. అయితే, 50 మంది ఎంపీల మ‌ద్ధ‌తు కాంగ్రెస్ ఇచ్చిన అవిశ్వాస నోటీస్ ఉండ‌డంతో  (Against Modi Govt) స్పీక‌ర్ ఆమోదించారు.

Also Read : Congress-Brs Vs Modi : మోడీ ప్రభుత్వంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం

పార్లమెంట్‌లో 26 ప్రతిపక్ష పార్టీల కూటమి, ఇండియా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణ‌యించింది. మణిపూర్ అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం ప్రతిపక్షాల ల‌క్ష్యంగా కనిపిస్తోంది. మణిపూర్ పరిస్థితిపై చర్చకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని ప్రభుత్వం పట్టుబట్టినప్పటికీ, కీలకమైన అంశంపై పార్లమెంటులో ప్రధాని మాట్లాడేలా చేయడం కూడా ఒక వ్యూహమని చెబుతున్నారు.

గ‌తంలోనూ రాఫెల్ డీల్ అంశంపై పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌లు స్తంభించిపోయాయి. ఆ త‌రువాత చ‌ర్చ జ‌రిగింది. వ్య‌వ‌సాయ చ‌ట్టాల మీద కూడా పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల్లో గంద‌ర‌గోళం నెల‌కొన్ని విష‌యం గుర్తుండే ఉంటుంది. గ‌త పార్ల‌మెంట్ స‌మావేశాల సంద‌ర్భంగా ఆదానీ ఇష్యూను విప‌క్షాలు లేవ‌నెత్తాయి. ఆ సంద‌ర్బంగా మోడీ మీద అవినీతి ఆరోప‌ణ‌ల‌ను రాహుల్ చేశారు. మోడీ, ఆదానీ జంట‌గా చేసిన ఆర్థిక మోసాల‌ను బ‌య‌ట‌పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. అదే స‌మ‌యంలో గుజరాత్ కోర్టు శిక్ష వేయ‌డంతో రాహుల్ మీద అన‌ర్హ‌త వేటు ప‌డింది. ఇప్పుడు మ‌ణిపూర్ ఘ‌ర్ష‌ణ‌, అల్ల‌ర్లు అంశంపై చ‌ర్చ‌కు విప‌క్ష కూట‌మి (Against Modi Govt) ప‌ట్టుబ‌డుతోంది.

Also Read : BRS Party: లోక్ సభలో బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం, మజ్లిస్ మద్దతు!

మ‌హిళ‌ల్ని వివ‌స్త్ర‌ల‌ను చేసి ఊరేగించ‌డం, బ‌హిరంగ రేప్ లు, సామూహిక అత్యాచారాలు త‌దిత‌ర సంఘ‌ట‌న‌లు మ‌ణిపూర్ లో చోటుచేసుకున్నాయి. ఇంకా చాలా ఘోరాలు బ‌య‌ట‌కు రాలేదు. ఇప్ప‌టికీ అట్టుడికి పోతోన్న మ‌ణిపూర్ అల్ల‌ర్ల వ్య‌వ‌హారాన్ని తేల్చ‌డానికి విప‌క్ష కూట‌మి ఒక‌టైయింది. ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అవిశ్వాసాన్ని పెట్టింది. విప‌క్ష కూట‌మి పార్టీల‌కు త‌మ అభిప్రాయాల‌ను తెలియ‌చేయ‌డానికి ఇదో అస్త్రంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అంతేగానీ, అవిశ్వాసం తీర్మానం వీగిపోనుంద‌ని స‌ర్వ‌త్రా తెలిసిందే.