Pakistani Drones: పాకిస్థాన్ డ్రోన్ క‌ల‌క‌లం.. కూల్చివేసిన భారత సైన్యం..!

పాకిస్తాన్ సరిహద్దుల నుండి భారత భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్‌ను సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) కూల్చివేసింది.

  • Written By:
  • Updated On - November 13, 2022 / 12:32 PM IST

పాకిస్తాన్ సరిహద్దుల నుండి భారత భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్‌ను సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) కూల్చివేసింది. ఈ డ్రోన్స్ లో డ్రగ్స్, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తీసుకువచ్చాయని ఫోర్స్ డైరెక్టర్ జనరల్ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. డ్రోన్ ఫోరెన్సిక్స్‌ను అధ్యయనం చేసేందుకు ఇటీవల ఢిల్లీలోని క్యాంపులో అత్యాధునిక ప్రయోగశాలను ఏర్పాటు చేసిందని, ఫలితాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయని ఆయన అన్నారు.

గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ సరిహద్దు చట్టవిరుద్ధ చర్యలో పాల్గొన్న నేరస్థుల విమాన మార్గం, చిరునామాను కూడా భద్రతా సంస్థలు ట్రాక్ చేయగలవని ఆయన తెలిపారు. వెబ్‌నార్ సెషన్ ద్వారా ఫోరెన్సిక్ ల్యాబ్‌ను ప్రారంభించే కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాతో డీజీ ఈ విషయాన్ని తెలిపారు. భారత భూభాగంలోకి ప్రవేశించిన అనుమానిత డ్రోన్ శబ్దం వినిపించిందని ఫోర్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

చొరబాటును అడ్డుకునే ప్రయత్నంలో BSF దళాలు డ్రోన్‌పై కాల్పులు జరిపాయని ప్రకటించింది. ఈ క్రమంలో నేలకూలిన డ్రోన్‌ ను ఆర్మీ స్వాధీనం చేసుకుంది. ఈ ఘటన తరువాత ఆ ప్రాంతంలో భద్రత బలాగాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. పాక్ చర్యలను సమర్థవంతంగా భారత భద్రత బలగాలు తిప్పికొడుతున్నాయి. 2020లో భారత్- పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 79 డ్రోన్ విమానాలను BSF గుర్తించగా, 2021లో 109 డ్రోన్ లను గుర్తించగా.. ఈ ఏడాది 266కి పెరిగాయని DG పంకజ్ కుమార్ సింగ్ చెప్పారు. డ్రోన్‌లను కూల్చివేసే తమ సరిహద్దు బృందాలకు ప్రోత్సాహం, నగదు బహుమతులు ఇచ్చే కొత్త వ్యవస్థను ఫోర్స్ ఇప్పుడు ప్రారంభించిందని డిజి చెప్పారు.