Congress “Party”: రాహుల్ పై బీజేపీ సోషల్ స్ట్రైక్.. నాగ్ పూర్ లో కాంగ్రెస్ శిక్షణ కార్యక్రమంలో గానా బజానాపై దుమారం

రాహుల్ గాంధీ నేపాల్ లోని ఒక నైట్ క్లబ్ పార్టీలో పాల్గొన్న వ్యవహారాన్ని మర్చిపోకముందే.. బీజేపీ మరో సంచలన వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.

  • Written By:
  • Updated On - May 12, 2022 / 02:22 PM IST

రాహుల్ గాంధీ నేపాల్ లోని ఒక నైట్ క్లబ్ పార్టీలో పాల్గొన్న వ్యవహారాన్ని మర్చిపోకముందే.. బీజేపీ మరో సంచలన వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో కాంగ్రెస్ యువ కార్యకర్తల శిక్షణ కార్యక్రమ వీడియో అది. ఇందులో కాంగ్రెస్ యువ కార్యకర్తలు గానా బజానా తో చిందులు వేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ‘ పీలే పీలే ఓ మర్జానీ’ (ఓ ప్రియుడా .. తాగేయ్), ‘ ‘ నాయక్ నహీ ఖల్ నాయక్ హు మై ‘ (నేను హీరోను కాదు విలన్ ను) అనే సాంగ్స్ కు కాంగ్రెస్ యువ కార్యకర్తలు డ్యాన్స్ వేస్తుండటాన్ని ఆ వీడియోల్లో చూడొచ్చు. ఈ 24 సెకన్ల వీడియోను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ట్విటర్ లో షేర్ చేశారు.

షెహజాద్ పూనావాలా కామెంట్..

‘ INC అంటే ఐ నీడ్ సెలెబ్రేషన్ అండ్ పార్టీ’ అనే అర్ధాన్ని ఇచ్చేలా మారిపోయింది. నాగ్ పూర్ లో యువ కాంగ్రెస్ కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారా ? విందులు ఇస్తున్నారా? తెలియడం లేదు. వాళ్ళు చేస్తున్న డ్యాన్సులు చూడండి, ఆ పాటలు వినండి. అసలు విషయం ఇట్టే తెలిసిపోతుంది. రాహుల్ నేపాల్ పబ్ లో గడుపుతుంటే.. కాంగ్రెస్ జూనియర్ నాయకులు ఇక్కడ గానా బజానా చేస్తున్నారు. జైసా నేతా వైసా ఫాలోయర్.. జైసా రాజా వైసా ప్రజా ‘ అని ట్విట్టర్ లో షెహజాద్ పూనావాలా కామెంట్ చేశారు. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ లో మత కలహాలు జరుగుతున్నా.. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అలుముకున్నా ఏమీ పట్టనట్టు కాంగ్రెస్ యువ కార్యకర్తలు గానా బజానా లో మునిగిపోయారు అని ఆయన వ్యాఖ్యానించారు.