నాసిర‌కం కంపెనీల‌కు కోట్లు కురిపించిన కోవిడ్ ..భార‌త్ లో న‌కిలీ వ‌స్తువుల‌ విక్ర‌య జోరు

నాసిర‌కం వ‌స్తువుల‌ను వినియోగ‌దార్ల‌కు అమ్మ‌డంలో భార‌తీయ కంపెనీలు ముందు వరుస‌లో ఉంటాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. కోవిడ్ -19 వ‌చ్చిన త‌రువాత దాని నుంచి ర‌క్ష‌ణ పొందొచ్చ‌ని చాలా కంపెనీలు నాసిర‌కం శానిటైజ‌ర్లు, వస్తువుల‌ను విక్ర‌యించాయి.

  • Written By:
  • Publish Date - October 27, 2021 / 05:17 PM IST

నాసిర‌కం వ‌స్తువుల‌ను వినియోగ‌దార్ల‌కు అమ్మ‌డంలో భార‌తీయ కంపెనీలు ముందు వరుస‌లో ఉంటాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. కోవిడ్ -19 వ‌చ్చిన త‌రువాత దాని నుంచి ర‌క్ష‌ణ పొందొచ్చ‌ని చాలా కంపెనీలు నాసిర‌కం శానిటైజ‌ర్లు, వస్తువుల‌ను విక్ర‌యించాయి. కొన్ని కంపెనీలు త‌మ వ‌స్తువులు 99శాతం కోవిడ్ నుంచి ర‌క్ష‌ణ ఇస్తాయ‌ని ప్ర‌క‌ట‌న‌ల‌ను ఊద‌ర‌గొట్టాయి. వాటిని గుర్తించిన వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల‌శాఖ నోటీసులను జారీ చేసింది. దీంతో ఆరు ప్ర‌ముఖ కంపెనీలు ప్ర‌క‌ట‌న‌ల‌ను నిలిపివేశాయి.
కోవిడ్ నుంచి 99శాతం ర‌క్ష‌ణ ఇస్తాయ‌ని ఉత్ప‌త్తుల‌ను విక్ర‌యిస్తోన్న ఆరు కంపెనీలు వ్యాపారాన్ని నిలిపివేసేలా వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల‌శాఖ చ‌ర్య‌లు తీసుకుంది. గ‌త ఏడాది నుంచి 27 కంపెనీలు వినియోగదారుల‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించేలా అడ్వ‌ర్టైజ్ మెంట్ ఇచ్చాయి. మ‌రో 29 కంపెనీలు మోస‌పూరితంగా వ్యాపారం చేశాయ‌ని కేంద్ర వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల‌శాఖ గుర్తించింది. ఆ మేర‌కు మొత్తం 56 కంపెనీల‌కు నోటీసులను జారీ చేసింది. ఈ కంపెనీలు ఎక్కువ‌గా గోడ రంగులు, ఫ్యాబ్రిక్స్ ను త‌యారు చేసేవిగా ఉన్న‌ట్టు గుర్తించింది. త‌యారు చేసిన ఉత్ప‌త్తి మీద న‌మోదు చేసే దేశం పేరును మార్చేసిన సంఘ‌ట‌న‌పై 202 నోటీసులు జారీ చేసింది. బ‌ట్ట‌లు త‌యారీ కంపెనీలకు 35 నోటీసులు, ఎల‌క్ట్రానిక్ గూడ్స్ కంపెనీల‌కు 47 ఉన్నాయి. వీటిలో 75 కంపెనీలుకు నోటీసులు జారీ చేయ‌గా 68 కంపెనీలకు జ‌రిమానా విధించారు. ఆ రూపంలో సుమారు 45ల‌క్ష‌లు వినియోదారుల‌శాఖ‌కు జ‌మ అయ్యాయి.
వినియోగ‌దారుల ర‌క్ష‌ణ చ‌ట్టం 2020, తునిక‌లు కొల‌త‌ల‌శాఖ చ‌ట్టం 2011, బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ చ‌ట్టం 2016 కు వ్య‌తిరేకంగా విక్ర‌యాల‌ను చేసిన కంపెనీలు బోలుడు. వాటిని గుర్తించిన వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల‌శాఖ నోటీసుల‌ను జారీ చేస్తూ..న‌కిలీ, నాసిర‌కం వ‌స్తువుల విక్ర‌యాల‌ను ఆపే ప్ర‌య‌త్నం చేస్తోంది.