Yogi Sarkar : గ్యాంగ్‎స్టర్ల ఏరివేతే లక్ష్యంగా రంగంలోకి యోగిసర్కార్, మాఫియా జాబితా విడుదల

  • Written By:
  • Updated On - April 17, 2023 / 10:12 AM IST

మాఫియా  ప్రపంచం భిన్నంగా ఉంటుంది. వారిని ఏరిపారేసే పోలీసులకు కూడా గొప్ప ధైర్యం ఉంటుంది. అతిక్ హత్యతో యూపీ (Yogi Sarkar) మొత్తం అలర్ట్ అయ్యింది. యోగిసర్కార్ మాఫియా డాన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది. మాఫియాను అంతమొందించడమే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు సమాచారం. యూపీలో రౌడిషీటర్ల పేర్లు వినిపించకుండా ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే మాఫియా జాబితాను కూడా రిలీజ్ చేసింది. ఇందులో 25మంది కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. చాలా కాలంగా మాఫిగా జాబితాలో అగ్రస్థానంలో ఉన్న అతిక్ అహ్మద్ పేరు…తన మరణంతో అటోమేటిగ్గా బయటపడింది.

25 కొత్త మాఫియా జాబితా:

యోగి సర్కార్ 2.0 25 కొత్త మాఫియాను జాబితా చేసింది, ఇందులో భాదోహి జ్ఞాన్‌పూర్ స్థానం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బాహుబలి విజయ్ మిశ్రా, మాజీ BSP MLC హాజీ ఇక్బాల్ అలియాస్ బాలా, సహర్‌పూర్ నివాసి, ప్రఖ్యాత సునీల్ రాఠీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన బదన్ సింగ్ అలియాస్ బద్దో ఉన్నారు. అంబేద్కర్ నగర్‌కు చెందిన అజయ్ సిపాహితో సహా ఇతర వ్యక్తులు చేర్చబడ్డారు.

మాఫియాపై ఎస్టీఎఫ్, పోలీసులు నిశితంగా నిఘా:
జాబితాలో చేర్చబడిన మాఫియా కార్యకలాపాలపై STF, జిల్లా పోలీసులు నిఘా పెట్టారు. సర్కార్ బయటపెట్టిన జాబితాలో ఉన్నవారి కంటే ముందు 25 లిస్టెడ్ మాఫియాలో మాఫియా ముఖ్తార్ అన్సారీ, బ్రిజేష్ సింగ్, త్రిభువన్ సింగ్ అలియాస్ పవన్ సింగ్, సంజీవ్ మహేశ్వరి అలియాస్ జీవా, ఓంప్రకాష్ శ్రీవాస్తవ అలియాస్ బబ్లూ, సుశీల్ అలియాస్ మూచ్, సీరియల్ కిల్లర్ సలీం, రుస్తుమ్, సోహ్రాబ్ మరియు ఇతర పేర్లు ఉన్నాయి.