Site icon HashtagU Telugu

Manipur violence: మణిపూర్‌లో మొదలైన హింసాత్మక ఘటనలు

Manipur

Manipur Violence

Manipur violence: మణిపూర్‌లో హింసాత్మకమైన నేపథ్యంలో సాయుధ బలగాలు (AFSPA) పరిధిని విస్తరించనున్నట్లు ప్రకటించారు. మణిపూర్‌లోని కొండ ప్రాంతాలను మళ్లీ AFSPA పరిధిలోకి తెచ్చినట్లు ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. మణిపూర్‌లోని 19 పోలీసు స్టేషన్‌లు మినహా మొత్తం ప్రాంతాన్ని ఆరు నెలల పాటు డిస్టర్బ్‌డ్ ఏరియాగా ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. AFSPA చట్టం అక్టోబర్ 1, 2023 నుండి అమల్లోకి వస్తుందని చెప్పబడింది. ఇంఫాల్, లాంఫెల్, సిటీ, సింగ్జామీ, సెక్మై, లాంసాంగ్, పాస్టోల్, వాంగోయ్, పోరోంపట్, హంగాంగ్, లామ్లై, ఇరిబంగ్, లిమాఖోంగ్, తౌబల్, బిష్ణుపూర్, నంబోల్, మొయిరాంగ్, కక్చిన్ మరియు జిరాబామ్ పోలీస్ స్టేషన్‌లను ఏఎఫ్‌ఎస్‌పిఎ పరిధిలో నుంచి మినహా యించారు.

మే నుండి మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మెయిటీ మరియు కుకీ కమ్యూనిటీల మధ్య జరుగుతున్న హింసలో ఇప్పటివరకు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. తాజాగా మణిపూర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా మళ్లీ ఇంటర్నెట్‌పై నిషేధం విధించారు. ఇటీవల మణిపూర్‌లో ఇద్దరు విద్యార్థుల హత్య తర్వాత ఉద్రిక్త పరిస్థితులు పెరిగాయి. మణిపూర్ ప్రభుత్వం అక్టోబర్ 1, 2023 రాత్రి 7:45 గంటల వరకు రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది.

Also Read: Goa Tour: హైదరాబాద్ టు గోవా.. ప్యాకేజీ ఇదే