Site icon HashtagU Telugu

Afghanistan Embassy : తాలిబన్ల సంచలన ప్రకటన.. ఇండియాలో ఎంబసీ బంద్.. ఎందుకంటే ?

Afghanistan Embassy

Afghanistan Embassy

Afghanistan Embassy : ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్ పాలకులు సంచలన ప్రకటన చేశారు. ఇండియా రాజధాని ఢిల్లీలోని తమ రాయబార కార్యాలయం (ఎంబసీ) కార్యకలాపాలను ఆదివారం(ఈరోజు) నుంచి ఆపేస్తున్నామని వెల్లడించారు. ఆతిథ్య భారత ప్రభుత్వం నుంచి మద్దతు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.  శనివారం రాత్రి ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఆఫ్ఘన్, భారత్ మధ్య చారిత్రక సంబంధాలు, దీర్ఘకాల భాగస్వామ్యం ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో మా రాయబార కార్యాలయాన్ని మూసేయక తప్పటం లేదు. ఈ నిర్ణయం ప్రకటిస్తున్నందుకు చింతిస్తున్నాం’’ అని తాలిబన్ పాలకులు చెప్పారు.

Also read : Pro China President : మాల్దీవుల అధ్యక్షుడిగా చైనా మనిషి.. ఇండియాతో సంబంధాలపై ఎఫెక్ట్ ?

‘‘మా దేశం పట్ల భారత్ ఆసక్తి చూపించడం లేదు. రాయబార కార్యాలయంలో సిబ్బంది, వనరులను తగ్గించారు. ఈ పరిస్థితుల్లో మేం కార్యకలాపాలను నిర్వహించడం కష్టతరంగా మారింది’’ అని ఢిల్లీలోని ఆఫ్ఘన్ ఎంబసీ కార్యకలాపాల నిలిపివేతపై తాలిబన్లు వివరణ ఇచ్చారు. రాయబార కార్యాలయం మూసేసినా ఆఫ్ఘన్ పౌరులకు అత్యవసర కౌన్సిలర్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. 2021 ఆగస్టులో అఫ్ఘానిస్థాన్‌లో అధికార పీఠంపైకి తాలిబన్లు వచ్చారు. భారతదేశం ఇంకా తాలిబన్ల సర్కారును అధికారికంగా గుర్తించలేదు. ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయంలో రాయబారిగా ఫరీద్ మముంద్‌జాయ్ పనిచేశారు. ఆయనను మునుపటి అష్రఫ్ ఘనీ ప్రభుత్వం భారత రాయబారిగా నియమించింది. దౌత్య సంబంధాలపై వియన్నా కన్వెన్షన్ (1961)లోని ఆర్టికల్ 45 ప్రకారం రాయబార కార్యాలయం ఆస్తి, సౌకర్యాలు ఆతిథ్య దేశం యొక్క సంరక్షక అధికారానికి(Afghanistan Embassy) బదిలీ చేస్తారు.