Anna Hazare : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇటీవలే బెయిల్‌పై విడుదలైన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై సామాజిక కార్యకర్త అన్నా హజారే కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల్లో సీఎం పదవి నుంచి తప్పుకుంటానని కేజ్రీవాల్ చేసిన ప్రకటనపైనా ఆయన స్పందించారు. రాజకీయాల్లోకి రావొద్దని తాను ఎన్నడో కేజ్రీవాల్‌కు సూచించానని అన్నా హజారే పేర్కొన్నారు. అయినా తన మాటను పట్టించుకోకుండా.. కేజ్రీవాల్ తొందరపాటు వైఖరితో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారని చెప్పారు.
Also Read :Elderly Population : రికార్డు స్థాయిలో పెరిగిన వృద్ధుల జనాభా.. సర్వత్రా ఆందోళన
‘‘రాజకీయాల కంటే సామాజిక ఉద్యమాల ద్వారానే దేశంలో మంచి మార్పులను తీసుకురావచ్చు. ఆవిషయాన్నే నేను కేజ్రీవాల్‌కు చెప్పాను. కానీ ఆయన వినిపించుకోలేదు’’ అని అన్నా హజారే(Anna Hazare) తెలిపారు. ‘‘రాజకీయాల్లో చాలా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. మనిషిని దురాశ దెబ్బతీస్తుంది. ఇప్పుడు కేజ్రీవాల్ ఎలా ఫీలవుతున్నారో నాకైతే తెలియదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని నెలల క్రితం అరవింద్ కేజ్రీవాల్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అరెస్టు చేసిన టైంలో కూడా అన్నా హజారే స్పందించారు. అప్పట్లోనూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read :Yemen Vs Israel : ఇజ్రాయెల్‌కు హౌతీ మిస్సైళ్ల వణుకు.. హౌతీలకు మిస్సైళ్లు ఇచ్చిందెవరు ?
‘‘అరవింద్ కేజ్రీవాల్ నాతో కలిసి ఢిల్లీలోని రాంలీలా మైదాన్ వేదికగా సామాజిక ఉద్యమం చేశాడు. మద్యానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. అలాంటి వ్యక్తే రాజకీయాల్లోకి వెళ్లాక మద్యం విక్రయ పాలసీలను తయారు చేయాల్సి వచ్చింది. మద్యం అనే భావనే సామాజిక ప్రయోజనాలకు విరుద్ధమైంది. మద్యం, డబ్బు మత్తుతో కూడుకున్నవి. వాటి ఊబిలో చిక్కుకున్న వారిని ఎవరూ కాపాడలేరు. కేజ్రీవాల్ కూడా డబ్బు మత్తులో మద్యం పాలసీని తయారు చేసి ఉంటారు’’ అని ఆనాడు అన్నా హజారే కామెంట్ చేశారు. దానిపై అప్పట్లో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే నడిచింది.