Kendriya Vidyalaya : కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి అడ్మిషన్ ఇలా..

Kendriya Vidyalaya : కేంద్ర విద్యాశాఖ పరిధిలో పనిచేసే కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరం కోసం త్వరలోనే ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి.

  • Written By:
  • Updated On - March 2, 2024 / 01:27 PM IST

Kendriya Vidyalaya : కేంద్ర విద్యాశాఖ పరిధిలో పనిచేసే కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరం కోసం త్వరలోనే ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. ఒకటో తరగతిలో పిల్లలను చేర్పించడానికి ఆసక్తి ఉన్న పేరెంట్స్ తెలుసుకోవాల్సిన నిబంధనలు ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం.

We’re now on WhatsApp. Click to Join

కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 అకడమిక్ ఇయర్ కోసం అడ్మిషన్ పొందాలంటే మార్చి 27 నుంచి అప్లికేషన్ ఫామ్స్  సమర్పించవచ్చు. తల్లిదండ్రులు అధికారిక వెబ్‌సైట్ www.kvsangathan.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో తమ పిల్లల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియ ఏప్రిల్ 17న ముగిసే అవకాశం ఉంది. నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్‌ఆర్‌ఐ)కు చెందిన పిల్లల అడ్మిషన్ ఫామ్‌లను కేంద్రీయ విద్యాలయాలు అంగీకరించవు.

Also Read : Cash Gift : శుభకార్యాల్లో రూ.101, రూ.1011 ఎందుకు ఇస్తారో తెలుసా ?

  • కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ పొందడం అంత ఈజీ కాదు.
  • ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లో క్వాలిఫై మార్కులు సాధించాలి.
  • అప్లికేషన్ ఫారమ్‌లో చిన్న మిస్టేక్ ఉన్నా అడ్మిషన్‌ను క్యాన్సిల్ చేస్తారు.
  • కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో పిల్లలను చేర్చాలంటే వారి వయసు కనీసం 6 సంవత్సరాలు ఉండాలి. అంత కంటే తక్కువ వయసు ఉంటే విద్యార్థుల అడ్మిషన్  ఫారమ్స్‌ను రెజెక్ట్ చేస్తారు.
  • 2024 ఏప్రిల్ 1 నాటికి 6 ఏళ్లు నిండిన విద్యార్థుల తరఫున వారి పేరెంట్స్  అప్లై చేయాలి. ఇక తొమ్మిదో తరగతి, 11వ తరగతుల్లో చేరే విద్యార్థులకు కనీస లేదా గరిష్ట వయోపరిమితి నిబంధన ఉండదు.

Also Read :Bollywood Ramayan : బాలీవుడ్ రామాయణం ముహూర్తం ఫిక్స్..!

నేపాల్, రష్యా, టెహ్రాన్‌లలోనూ కేంద్రీయ విద్యాలయాలు 

కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేసే కేంద్రీయ విద్యాలయాలు దేశవ్యాప్తంగా 1,243 ఉన్నాయి. నేపాల్ రాజధాని ఖాట్మండు, రష్యా రాజధాని మాస్కో, ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ల్లో కూడా కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ సీబీఎస్‌ఈ బోర్డుతో అనుబంధంగా పనిచేస్తాయి. రాబోయే అకడమిక్ ఇయర్‌ కోసం కేంద్రీయ విద్యాలయాల్లో తమ పిల్లల అడ్మిషన్ కోసం ఆసక్తి ఉన్న తల్లిదండ్రులు తప్పనిసరిగా నిర్దేశిత వయసు ప్రమాణాలకు కట్టుబడి ఉండాలి.

Also Read : Medicines: సుద్దపొడితో తయారు చేసిన మందులు.. తెలంగాణలో విక్ర‌యం..!

పిల్లలకు ఆరేళ్లు నిండితేనే ఒకటో తరగతిలో అడ్మిషన్‌ ఇచ్చేలా నిబంధనలు రూపొందించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.  ఈ మేరకు ఇటీవల రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖలు రాసినట్లు తెలుస్తోంది.నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ(ఎన్‌ఈపీ) 2020, రైట్‌ టు ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ 2009 కింద ఒకటవ తరగతిలో చేరే పిల్లలకు ఆరేళ్ల వయసు తప్పనిసరని లేఖలో తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇది అమలు చేయాలని కోరింది.   3 నుంచి 8వ సంవత్సరాల వయసు మధ్యలో పిల్లలకు 3 ఏళ్ల ప్రి స్కూల్‌, 1,2వ తరగతులు పూర్తయితే పిల్లలకు నేర్చుకునేందుకు మంచి అవకాశాలుంటాయని నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీలో పేర్కొన్న విషయాన్ని కేంద్రం గుర్తు చేసింది. పిల్లలను ఒకటవ తరగతిలో చేర్చించే వయసు పలు రాష్ట్రాల్లో పలు రకాలుగా ఉందని గతంలో లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో కేంద్రం తెలిపింది.