Air India Plane Crash : విమాన ప్రమాద బాధితులకు అదనంగా మరో రూ.25 లక్షలు

Air India Plane Crash : ఈ పరిహార నిర్ణయంతో, బాధితుల కుటుంబాలకు కొంత మానసిక స్థిరత్వం కలుగుతుందనే నమ్మకంతో ఎయిర్ ఇండియా ముందుకొచ్చింది

Published By: HashtagU Telugu Desk
Air India

Air India

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India Plane Crash) తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలపై అన్ని వర్గాల నుండి సానుభూతి వ్యక్తమవుతోంది. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు టాటా గ్రూప్ (Tata Group) ఇప్పటికే రూ.1 కోటి పరిహారాన్ని ప్రకటించగా, తాజాగా ఎయిర్ ఇండియా (Air India) మరో అడుగు ముందుకేసింది.

Kim Jong Un: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం.. కిమ్ జాంగ్ ఉన్ కీల‌క ఆదేశాలు!

ఎయిర్ ఇండియా తాజాగా ప్రకటించిన వివరాల ప్రకారం, మృతుల కుటుంబాలకు అదనంగా రూ.25 లక్షల (Rs.25 lakhs) తక్షణ సాయం అందించనుంది. కేవలం మృతులకే కాకుండా, ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికులకూ అత్యవసర అవసరాలకు ఉపయోగపడేలా ఈ సాయం అందించనుంది. బాధితుల కుటుంబాలకు అండగా ఉండేలా కంపెనీ చర్యలు చేపడుతోంది.

ఈ పరిహార నిర్ణయంతో, బాధితుల కుటుంబాలకు కొంత మానసిక స్థిరత్వం కలుగుతుందనే నమ్మకంతో ఎయిర్ ఇండియా ముందుకొచ్చింది. టాటా గ్రూప్, ఎయిర్ ఇండియా ఈ విషయంలో బాధ్యతాయుతంగా స్పందిస్తున్నట్టు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా, బాధితులకు మెరుగైన సహాయం అందించేందుకు ప్రభుత్వంతో కలిసి విమాన సంస్థలు కృషి చేస్తున్నాయి.

  Last Updated: 14 Jun 2025, 08:16 PM IST