Site icon HashtagU Telugu

Sikkim: సిక్కిం వరదల్లో అలనాటి నటి ఆచూకీ గల్లంతు!

Sarala Kumari

Sarala Kumari

Sikkim: సిక్కింలో వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వరదల ధాటికి ప్రాణ నష్టం భారీగా జరుగుతోంది. ఇక అలనాటి నటి ఆచూకీ గల్లంతైంది. దానవీరశూరకర్ణ, సంఘర్షణ వంటి చిత్రాల్లో నటించిన సరళా కుమారి సిక్కింలో గల్లంతయ్యారు. 1983లో మిస్ ఆంధ్రప్రదేశ్‌గా సరళా కుమారి ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ హైటెక్‌ సిటీలో నివాసం ఉంటున్న సరళాకుమారి.. స్నేహితురాళ్లతో కలిసి అక్టోబర్ 2న సిక్కిం వెళ్లారు. ఈ విషయమై ఆమెరికాలో ఉంటున్న ఆమె కుమార్తెకు కూడా సమాచారం ఇచ్చారు.

స్థానికంగా ఉన్న హోటల్లో వారు బస చేసినట్లు తెలిసింది. సిక్కింలో భారీ వర్షాలతో వచ్చిన ఆకస్మిక వరదల తర్వాత  సరళాకుమారి ఆచూకీ గల్లైంతైంది. తల్లి ఆచూకీ లేకపోవడంపై అమెరికాలో ఉంటున్న ఆమె కుమార్తె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన తల్లి ఆచూకీ కనిపెట్టాలని రాష్ట్రప్రభుత్వాన్ని అర్థిస్తున్నారు.

కాగా పశ్చిమ బెంగాల్‌లోని తీస్తా నది పరీవాహక ప్రాంతంలో 30కి పైగా మృతదేహాలను వెలికితీశారు. 22 మంది సైనికులు తప్పిపోయారని, వారిలో 7 మంది మృతదేహాలను వెలికి తీశారు. వరదల కారణంగా దాదాపు 50 మందికిపైగా చనిపోయారు. ఇప్పుడు కూడా గత నాలుగు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 3 వేల మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. అయితే వాతావరణ పరిస్థితులు క్షీణించడం వల్ల ఎయిర్ రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలుగుతోంది.