Hero Sriram : ప్రముఖ సినీనటుడు శ్రీరామ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ తమిళనాడులో కలకలం రేపుతోంది. ‘రోజాపూలు’, ‘ఒకరికి ఒకరు’ వంటి హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీరామ్‌పై, చెన్నై పోలీసులు చర్యలు తీసుకున్నారు. చెన్నైకి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం అందిన నేపథ్యంలో, శ్రీరామ్‌ను అరెస్ట్ చేసి, చెన్నైలోని నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తర్వాత ఆయనను ఎగ్మోర్ న్యాయస్థానానికి హాజరుపరిచిన పోలీసులు, జులై 7వ తేదీ వరకు రిమాండ్ విధించాలని కోర్టును అభ్యర్థించగా, ధర్మాసనం ఇందుకు ఆమోదం తెలిపింది. అదేవిధంగా, శ్రీరామ్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, శ్రీరామ్ తన తరపున బెయిల్ కోరుతూ కోర్టులో విన్నవించారు.
తాను చేసిన తప్పును ఒప్పుకున్న శ్రీరామ్, “నేను తప్పు చేశాను కానీ డ్రగ్స్ ఎవరికీ అమ్మలేదు. ఎవరిని ప్రేరేపించలేదు. నేను మాత్రమే వాడాను,” అని పేర్కొన్నాడు. తన కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడని, కుటుంబ బాధ్యతల నిమిత్తం బెయిల్ అవసరమని న్యాయమూర్తిని కోరాడు.
“విదేశాలకు పారిపోను, సాక్షులను ప్రభావితం చేయను, విచారణకు పూర్తిగా సహకరిస్తాను” అని హామీ ఇచ్చారు శ్రీరామ్. ఇటు పోలీసులు, అటు శ్రీరామ్ దాఖలు చేసిన పిటిషన్లపై ఎగ్మోర్ కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందనే దానిపై సినీ, న్యాయ, సామాజిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Netanyahu : అమెరికా అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపిన ఇజ్రాయెల్ ప్రధాని